– రిజర్వాయర్ల పరిధిలోని నిర్వాసితులకు ముఖ్యమంత్రి ఎప్పుడు న్యాయంచేస్తారు? చట్టాలు మాకు చుట్టాలన్నట్టు ప్రవర్తించి, చివరకు న్యాయస్థానాల్లో, ఎన్జీటీలో భంగపడ్డారు
• అవులపల్లి, ముదివీడు,నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపేరుతో రూ.1600కోట్లు దోచేశారు
• పరిహారం ఊసులేక నిర్వాసితులు లబోదిబోమంటుంటే జగన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి చీమకుట్టినట్టు లేదు.
• అసలు మాకు ఎలాంటి రిజర్వాయర్లు అక్కర్లేదనే పరిస్థితికి నిర్వాసితులవచ్చారంటే వారివేదనకు రోదనకు కారణం ఈ ప్రభుత్వ చేతగాని తనం కాదా?
• ప్రభుత్వంపై పోరాడిన బాధితరైతుల్ని తెలుగుదేశం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
• తప్పుచేసిన అధికారుల్ని కఠినంగా శిక్షించి, నిర్వాసితులకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సుప్రీంకోర్టు తాజాగాఇచ్చిన తీర్పు, గతంలోఎన్జీటీ తీర్పు రాష్ట్రప్రభుత్వానికి చెంపపెట్టుఅని, రాష్ట్రంలో దోపిడీరాజ్యం సాగుతోంది అనిచెప్పడానికి నిదర్శనమని, పర్యావరణ చట్టాలు కాపాడాలనే బాధ్యతను ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్మరించడం సిగ్గుచేటు అని, వారిచేతగానితనం ఉమ్మడిచిత్తూరుజిల్లాలోని అవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులపేర్లు చెప్పగానేమహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందుతుంది అంటే దానికి కారణం తెలుగుగంగప్రాజెక్టే. ఎన్టీఆర్ గారి ఆలోచనలకు కార్యరూపమిస్తూ హంద్రీనీవా కోసం చంద్రబాబుగారు వేలకోట్లు ఖర్చుపెట్టారు. హంద్రీనీవా కాలువలద్వారానే కృష్ణాజలాలను కుప్పంసరిహద్దలవరకు తీసుకెళ్లారు. అవుకు టన్నెల్ నిర్మాణాన్ని చంద్రబాబు ఛాలెంజ్ గా తీసుకొని పూర్తిచేశారు. రూ.,3500కోట్లు ఖర్చుపెట్టి పులివెందులకు నీళ్లు ఇచ్చారు.
రిజర్వాయర్ల పరిధిలోని నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం చేస్తారు?
జగన్మోహన్ రెడ్డి వచ్చాక హంద్రీనీవా కాలువలపనుల్ని పూర్తిగా పడుకోబెట్టాడు. గాలేరు నగరి, జీఎన్ఎస్ఎస్ పనులు గాలికివదిలేశాడు. నీళ్లుతేలేని ప్రాజెక్టుల్లో అవినీతిచేయడానికే మంత్రిపెద్దిరెడ్డి బంధువులకు చెందిన పీ.ఎల్.ఆర్ కనస్ట్రక్షన్స్ సంస్థకు రూ.3వేలకోట్లతో మూడు ప్రాజెక్ట్ ల పనులు అప్పగించారు. అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లకు సంబంధించిన పనులు నిలిపివేయాలన్న ఎన్జీటీ తీర్పుపై పెద్దిరెడ్డి ఏం సమాధానం చెబుతాడు? ఆయా రిజర్వాయర్ల పరిధిలోని నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం చేస్తారు?
పరిహారం ఊసులేక నిర్వాసితులు లబోదిబోమంటుంటే జగన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి చీమకుట్టినట్టు లేదు. అసలు మాకు ఎలాంటి ప్రాజెక్ట్ అక్కర్లేదనే పరిస్థితికి నిర్వాసితులవచ్చారంటే వారివేదనకు రోదనకు కారణం ఈ ప్రభుత్వచేతగానితనం కాదా? పరిహారం ఇవ్వమన్నా, పనులు ఆపమ న్నా, నిర్వాసితుల్ని కాపాడాలన్నా లెక్కలేకుండా గుడ్డిగా ముందుకెళ్లి చివరకుఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. మూడురిజర్వాయర్లకు జీవోనెం-461ద్వారా మంత్రిపెద్దిరెడ్డి కోరికప్రకారం సెప్టెంబర్ 2, 2020న పరిపాలనఅనుమతులు ఇచ్చారు. చట్టాలను లెక్కచేయకుండా, రిజర్వాయర్ల నిర్మాణంపేరుతో ఇప్పటికే దాదాపు రూ.1600కోట్లు కాజేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చట్టాలు మా చుట్టాలన్నట్టు సుప్రీంకోర్టు చెప్పినా, ఎన్జీటీ తీర్పుఇచ్చినా లెక్కచేయకుండా ఇప్పటికీ పనులు కొనసాగిస్తున్నారు
సుప్రీంకోర్టుచెప్పినా, ఎన్జీటీ తీర్పుఇచ్చినా లెక్కచేయకుండా ఇప్పటికీ అవులపల్లి రిజర్వాయ ర్ నిర్మాణపనులుచేస్తున్నారు. చట్టాలు మీచుట్టాలు అయ్యాయా అని పెద్దిరెడ్డిని, ముఖ్యమం త్రిని ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి అడ్డగోలు దోపిడీపై జాతీయస్థాయిలో చర్చజరుగుతోంది. నిర్వాసితులకు న్యాయంచేయకుండా, సుప్రీంకోర్టుతీర్పుకు విరద్ధంగా, కేంద్రప్రభుత్వ, ఎన్జీటీ అనుమతులు తీసుకోకుండా రిజర్వాయర్ల నిర్మాణంచేపట్టడం వెనకున్న కుట్రకోణంఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. తమకు న్యాయంచేయాలని వేడుకుంటున్న నిర్వాసితులపైకి పోలీసు ల్ని పంపి ఎన్నాళ్లుఅరాచకం సాగిస్తారు?
ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, నిర్వాసి తులకు పరిహారం గానీ, ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ కమిటీ నిబంధనలు గానీ ఏవీ పెద్దిరెడ్డి ఇలాఖాలో అమలయ్యే పరిస్థితిలేదు. పెద్దిరెడ్డి చెప్పినట్టే అక్కడ చట్టాలు నడు స్తాయి. అందుకే నిర్వాసితుల బతుకులు రోడ్డునపడ్డాయి. భూములు, జీవితాలు కోల్పోయి న వారిపరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీరు-చెట్టు, నీరు-ప్రగతిపథకాల కింద రాయ లసీమలోని ప్రతిఎకరాకు నీళ్లుఅందించేలా చంద్రబాబుగారు పక్కాగా ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్ల నిర్మాణంచేపడితే, వాటినితుంగలోతొక్కి, జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నాడు.
ఎవరైతే నిర్వాసితులుఉన్నారో, వారంతా చందాలువేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నైబెంచ్) లో అప్పీలుచేశారు. ప్రభుత్వం, అధికారులు, మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలపై ఎన్జీటీ రూ.100కోట్ల జరిమానా విధిస్తూ, నిర్వాసితుల కష్టానికి న్యాయంచేసింది. ఎన్జీటీ మొదటి ఉత్తర్తుల్ని అధిగమించడానికి స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ పేరుతో అవులపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందినట్టు అబద్ధాలుచెప్పా రు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.5టీఎంసీల నుంచి 2.5టీఎంసీలకు మార్చి చూపించి ఈసీ తెచ్చినట్టు నాటకాలు ఆడారు. రైతులు హైకోర్టుని ఆశ్రయిస్తే అక్కడా అబద్ధాలుచెప్పి తప్పిం చుకున్నారు.
రాష్ట్రపర్యావరణ ప్రభావ అంచనా కమిటీకూడా మంత్రి పెద్దిరెడ్డి కిందపనిచేస్తోంది . దాన్ని అడ్డుపెట్టుకొని నాటకాలుఆడారు. ఇంతచేసిన మంత్రిపెద్దిరెడ్డి పాపం చివరకు ఎన్జీటీ లో పండింది. బాధితరైతుల్ని భయపెట్టి దారికితెచ్చుకోవడానికి వారిపై అట్రాసిటీకేసులు పెట్టి, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేకుండా, అర్థరాత్రుళ్లు కూడా ఉత్తుత్తిపనులుచేసి, రూ.1600కోట్లు బిల్లులుచేసుకున్నారు. అటవీభూములు విని యోగిస్తూ, ఆశాఖ అనుమతిలేకుండా అటవీచట్టాలను తుంగలో తొక్కారు.
ఏ కేటగిరిలో ఉన్న ప్రాజెక్ట్ ను బీ2 కేటగిరిలోకి మార్చి, అబద్ధాలతో రిపోర్ట్ తయారుచేసి, నేరపూరితంగా, కుట్రపూరితంగా కేంద్రప్రభుత్వాన్నే మోసగించారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి వారికి అనుకూ లంగా పనులుచేసుకోవడానికి ఏ రోటికాడ ఆపాటపాడారు. ఏదితోస్తే అదిచెప్పి తప్పించు కున్నారు. పరిశీలన, ఆధారాలులేకుండా ప్రభుత్వం తరుపు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అధికారులుకూడా వాస్తవాలుదాచి తప్పులమీదతప్పులు చేశారు. ఈ బాగోతాలుఅన్నీ ఎన్జీటీతీర్పుతో బట్టబయలయ్యాయి.
ఎస్.ఈ.ఐ.ఐ.ఏ సెప్టెంబర్ 8న ఇచ్చిన తీర్పుని కూడా ఎన్జీటీ రద్దుచేసింది. రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.100కోట్ల జరిమానా విధిం చింది. కే.ఆర్.ఎంబీకి ఆమొత్తం చెల్లించాలని ఆదేశించింది. మే25 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ ఆదేశిస్తే, ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడ్డారు. నిర్వాసితులకు రాష్ట్రజలవనరుల శాఖే న్యాయంచేయాలని ఆదేశించడం జరిగింది. కేంద్రజలవనరుల శాఖ రిజర్వాయర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలనికూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
డ్యామ్ లు కొట్టుకుపోతున్నా.. ప్రాజెక్ట్ ల గేట్లు కొట్టుకుపోతున్నా, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి దోపిడీయే పరమావధిగా మారింది
రాష్ట్రంలో దోపిడీరాజ్యం నడుస్తోంది. గండికోట రిజర్వాయర్లో నిర్వాసితుల్ని ముంచేశారు. అన్నమయ్యప్రాజెక్ట్ కొట్టుకుపోయి 62మంది చనిపోయారు. పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. పులిచింతల డ్యామ్ గేటు కొట్టుకుపోయి 18నెలలైనా ప్రభుత్వంలో స్పందనలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 3వ గేట్ మూలపడి 9 నెలలైంది. రాష్ట్రంలో ఏప్రాజెక్ట్ నిర్మాణానికి, మరమ్మతులకు టెండర్లు పిలవరు, పిలిచినా పనులుచేయడానికి కాంట్రాక్టర్లు రారు. ఉమ్మడిచిత్తూరు జిల్లాలో కేంద్రప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎన్జీటీ, నిబంధనలకు విరుద్ధంగా మూడురిజర్వాయర్ల నిర్మాణానికి రూ.3వేలకోట్ల అంచనాతో జీవో ఇచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో అవులపల్లి, ముదివీడు,నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపేరుతో రూ.1600 కోట్లు దోచేశారు. అడ్డగోలుగా ప్రాజెక్ట్ ల కేటగిరీలు మార్చి, టీఎంసీలు తగ్గించి ప్రజల సొమ్ము దోచేశారు. సుప్రీంకోర్టు తక్షణమే ఎన్జీటీకి రాష్ట్రజలవనరుల శాఖ రూ.100కోట్లు చెల్లించాలన్న తీర్పుకి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా? పర్యావరణహానికి, నిర్వాసితులకు మంత్రి పెద్దిరెడ్డి న్యాయం చేస్తాడా? ప్రభుత్వంపై పోరాడిన బాధితరైతుల్ని తెలుగుదేశంతరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తు న్నాం. తప్పుచేసిన అధికారులందరినీ కఠినంగాశిక్షించి, నిర్వాసితులకు న్యా యం చేయాలి” అని దేవినేని డిమాండ్ చేశారు.