-మా పార్టీ పరువును సిబిఐ బజారుకీడుస్తోంది
-అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సి.బి.ఐకి చెప్పలేం
-జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
-అవినాష్ ను అరెస్ట్ చేయడానికి సిబిఐ కున్న ఇబ్బంది లేదు
-అరెస్టు చేస్తారా?, చేయరా? అన్నది సిబిఐ అధికారుల ఇష్టం
-సుప్రీంకోర్టు ఒకటి చెబితే , మీరు ట్విస్ట్ చేసి మరొకటి చెబుతారా?
-హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని ఆదేశించిందని నీలి మీడియా ఛానల్స్ పేర్కొనడం పెద్ద బూతు
-సుప్రీంకోర్టులో విజయం సాధించిన డాక్టర్ సునీత
-మెడికల్ కాలేజీలో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహిస్తారనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసా?
-మెడికల్ కాలేజీలో సీట్లు బందర్ విద్యార్థులకు ఇస్తామని చెప్పడం అర్ధరహితం
-ఎంపీ నిధులు సక్రమంగా వినియోగిస్తున్న… నియోజకవర్గ ప్రజలు నాతో టచ్ లోనే ఉన్నారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయవద్దని సిబిఐకి చెప్పలేమని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ కి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. అరెస్టు చేస్తారా? చేయరా?అన్నది వాళ్ళ ఇష్టం. అరెస్టు కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే డ్రామాలు ఆడుకోవచ్చు. అంతేకానీ వలపు యుద్ధాలను మాత్రం చేయవద్దు.
సిబిఐ చేస్తున్న వలపు యుద్ధం వల్ల మా పార్టీ అప్రతిష్ట పాలవుతోంది. ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, ఈ ప్రభుత్వం ద్వారా పార్టీ పరువు ప్రతిష్ట సంక నాకి పోవడం తనలాంటి ఎంతోమంది పార్టీ సభ్యులకు ఇష్టం లేదు. ఇది గుండాల పార్టీ అని మా పార్టీకి ఓటు వేసే సాలీడు ఓటర్లు దూరమైతే, ఇక సాధారణ ప్రజలు మా పార్టీ కి ఓటు వేస్తారా?. మా పార్టీ పరువును సిబిఐ బజారుకీడుస్తోంది. అందుకే సీబీఐ అంటే నాకు కోపం. సిబిఐ వ్యవహార శైలి వల్ల మా పార్టీ దెబ్బతింటుంది. మా పార్టీ పరువు తీయవద్దన్నది నా విన్నపం. పార్టీలో కొనసాగుతున్న సభ్యులను గుండాలుగా చిత్రీకరించవద్దని కోరుతున్నాను. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలనుకుంటే సాయంత్రంలోగా అరెస్టు చేయండి. సుప్రీం కోర్టులో ఈరోజు డాక్టర్ సునీత విజయం సాధించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను నీలి మీడియా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి వెసులుబాటు లభించిందని, హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని ఆదేశించిందని నీలి మీడియా ఛానల్స్ పేర్కొనడం పెద్ద బూతు. హైకోర్టు వెకేషన్ బెంచ్ వెళ్తామంటే, వెళ్ళమని మాత్రమే సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అప్పటివరకు సిబిఐ అరెస్టు చేయకుండా, ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులు కోరగా, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేయడమే కాకుండా, అరెస్టు చేయవద్దని ఎటువంటి ఆదేశాలను ఇవ్వలేమని తేల్చి చెప్పిందన్నారు.
హైకోర్టు వెకేషన్ బెంచ్ కు సుప్రీం కోర్టు వెళ్ళమని చెప్పిందంటే అప్పటివరకు అరెస్టు చేయవద్దని సీబీ ఐ కి చెప్పినట్లేనని సాక్షి మీడియా ఛానల్లో కూర్చుని ఎస్ వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి . హైకోర్టు వెకేషన్ బెంచ్ కు అవినాష్ రెడ్డి వెళ్లడానికి, ఆయన అరెస్ట్ కు ఎటువంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి అండ్ కో, అవినాష్ రెడ్డి అండ్ కో , వైఎస్ ఫ్యామిలీ అండ్ కో ఇటువంటి వెధవ ట్రిక్కులకు పాల్పడతారనే డాక్టర్ వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, అవినాష్ రెడ్డి చేసిన ప్రార్థనను పరిశీలించమని కోరగా, జస్టిస్ జేకే మహేశ్వరి, నరసింహతో కూడిన ధర్మాసనం పరిశీలించి, స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పును నీలి చానల్స్ ట్విస్ట్ చేసి చెబుతున్నాయని, దానిపై దమ్ముంటే నాతో చర్చకు రావాలని రఘురామకృష్ణంరాజు సవాల్ విసిరారు. మంగళవారం నాడు సీబీఐ ప్రతినిధులు అసలు కోర్టుకే హాజరు కాలేదు. అయినా ఒకరకంగా మంచే జరిగింది. జగన్ అండ్ కంపెనీకి మేలు చేయడానికి సీబీఐ కోర్టుకు హాజరు కాలేదేమో నన్న అనుమానం లేకపోలేదు. వచ్చి కంపు చేయడం కన్నా, రాకపోవడమే మంచిదయ్యింద న్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలుగులో మాట్లాడితే సీబీఐ అధికారులు వింటారా? అని సాక్షి మీడియా ఛానల్లో కూర్చొని శర్మ అనే న్యాయవాది పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఏ భాషలో మాట్లాడి వినడానికి ట్రాన్స్ లేషన్లు వచ్చాయని, అయినా
నువ్వు నీ బాస్ విన్నారు కదా అంటూ అపహాస్యం చేశారు. గతం లో కొమ్మినేని కి కొన్ని విలువలు ఉండేవని, ఇప్పుడు వలవలను వదిలివేశారని విమర్శించారు. దమ్ముంటే రాష్ట్రానికి రావాలని కొంతమంది తనకు సవాళ్లు చేయడం సిగ్గుచేటు. రాష్ట్రానికి వస్తే మళ్లీ నన్ను అరెస్టు చేయాలని చూశారు. తప్పుడు కేసులు బనాయించాలని ఆరాటపడ్డారు. దమ్ముంటే, చానల్స్ లో చర్చకు పిలవాలని, తాను లైవ్ ఇన్ లో పాల్గొంటానని చెప్పారు. సుప్రీంకోర్టు ఒకటి చెబితే , మీరు ట్విస్ట్ చేసి మరొకటి చెబుతారా? నిజం చెప్పే చానల్స్ కూడా ఉన్నాయని గ్రహించండి అంటూ హెచ్చరించారు.
ఓట్ల కోసం సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?
ఓట్ల కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. బందర్ లో వస్తుందో రాదో తెలియని మెడికల్ కాలేజీలో స్థానికులకే సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. మెడికల్ కాలేజీలో ప్రవేశానికి జాతీయస్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తారనేది ముఖ్యమంత్రికి తెలుసా?., ఒకవేళ తెలియకపోతే విదేశాలకు వెళ్లి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి ని అడిగి తెలుసుకుని ఉంటే ఉండాల్సింది.. మన పార్టీలో ఏడవ, పదో తరగతి చదివిన వారు ఎంతో మంది ఉండగా, డిగ్రీ ఎక్కడ చదివారో తెలియదు కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విస్మయాన్ని కలిగించింది. బందర్ లో పోర్ట్ శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షసులతో పోల్చిన విషయం తెలిసిందే.
అయితే రాక్షసులు ఎవరో, దేవతలు ఎవరో ఒపీనియన్ పోల్ నిర్వహిస్తే తెలిసిపోతుందని పేర్కొన్నాను. అయితే మాజీ మంత్రి పేర్ని నాని అంటే తనకు ఎంతో గౌరవం. పేర్ని నాని నేను రాక్షసులతో పోల్చలేదన్నారు. దక్షిణ భారత దేశంలోని ముఖ్యమంత్రులంతా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు కలగకుండా చర్యలు తీసుకుంటుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం విమానంలో ప్రయాణం చేస్తున్న రోడ్డుపై ట్రాఫిక్ ను నిలిపి వేయాలని ఆదేశిస్తున్నారు . ముఖ్యమంత్రి టూర్ అంటేనే చెట్లు గజగజ వణికి పోతున్నాయని, ఆయన టూర్ కోసం ఏపుగా ఎదిగిన వృక్షాలను నరికి వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెట్లను ఎందుకు నరికి వేస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలతో పాటు, బెంగళూరు నగరంలోని చెట్లను నరికి వేసే ప్రమాదం ఉండేదన్నారు.
నన్ను నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు
నియోజకవర్గానికి నేనెందుకు రావడం లేదో నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంపీ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజలు నాతో నిత్యం టచ్ లో ఉంటున్నారు.. దమ్ముంటే నియోజకవర్గానికి రమ్మని కొంతమంది దుర్మార్గులు, దుష్టులు సవాల్ చేస్తున్నారని, ప్రధానమంత్రి పర్యటనకు హాజరవుతుంటే నన్ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా లిస్టు నా పేరు ఉంటే, ఎవరెన్ని కుట్రలు చేసి తొలగించారో నాకు తెలుసు. నేటితో ఎంపీగా ఎన్నికై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 2020 ఫిబ్రవరి 17వ 18 వ తేదీలలో ఆఖరు సారి నియోజకవర్గానికి వెళ్లాను. ఈ దుర్మార్గులు దుష్టు లు నన్ను చంపే ప్రయత్నం చేసినప్పటికీ, రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఎంతోమంది దేవాలయాల్లో ప్రార్ధనలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ భూమి మీద లేకుండా పైకి పంపించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం అడిగిన నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 10,430 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వినియోగించాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోతే దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను స్వాహా చేయకుండా, పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.