– ఏ ప్రభుత్వమైనా బీసీ లకు తలవంచాల్సిందే
– తల్కోటరా స్టేడియంలో బాగెదరి న్యాయ సమ్మేళనం సభలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఢిల్లీ: న్యాయ సమ్మేళనంలో దేశ వ్యాప్తంగా విచ్చేసిన వెనుకబడిన తరగతుల ముఖ్య నేతల సోదర సోదరీమణులకు తెలంగాణ రాష్ట్రం తరుపున స్వాగతం. 2022 లో బీసీ కుల గణన కీ వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది.
భారత్ జోడోయాత్ర లో రాహుల్ గాంధీ జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ ఎవరెంతో వారికంతా సామాజిక న్యాయం జరగాలని చెప్పారు. తెలంగాణ లో మన ప్రభుత్వం ఏర్పడగానే కుల గణన సర్వే చేశాం. కేంద్ర ప్రభుత్వం దానిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
నేను చాలా అదృష్టవంతుండిని. ఎన్ఎస్యుఐ సైనికుడిగా ఎన్నో పోరాటాలు చేశాను. 2009-14 వరకు ఎంపీ గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ మంత్రిగా బీసీ కుల గణన బిల్లు శాసన సభ లో పెట్టే అవకాశం దక్కింది.
రాహుల్ గాంధీ అభిప్రాయం ప్రకారం భవిష్యత్ లో ఓబీసీ లో బాగు కొరకు పోరాడతాను. మన బీసీ లమంతా ఏకం కావాలి. బీజేపీ ని సూటిగా అడుగుతున్నా. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలి. ఇప్పుడు మీరు చేయకపోతే రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము దేశ వ్యాప్తంగా కులగణన చేస్తాం.
బీసీ ల రిజర్వేషన్ల విషయంలో మండల కమిషన్ తెస్తే కమండల్ అన్నారు. రాహుల్ గాంధీ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని వెనుకబడిన తరగతులకు న్యాయం జరుగుతుంది. మనమంతా ఐక్యంగా ఉండాలి.
మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణన చేసి తీరాల్సిందే. ఏ ప్రభుత్వమైనా బీసీ లకు తలవంచాల్సిందే.
ఓబీసీ ల ఐక్యతకు అభివృద్ధికి రాహుల్ గాంధీ కి మద్దతు నిల్వండి. సభ కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రులు , పీసీసీ అధ్యక్షులు ముఖ్య నేతలు నాయకత్వం వహించండి. వచ్చే రోజులు వెనుకబడిన తరగతులవే. అందరం ఐక్యంగా ఉందాం. మనకు వచ్చే రోజుల్లో న్యాయం జరుగుతుంది. బీసీ కుల గణన విషయంలో మా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకత్వం గా ఉంటుంది. మీకు ఏ అనుమానాలు ఉన్నా మా ప్రభుత్వం, మేము సహకరిస్తాం.