Suryaa.co.in

Andhra Pradesh

వందేళ్ల తరువాత సమగ్ర సర్వే : మంత్రి ధర్మాన

విజయవాడ: వందేళ్ల తరువాత సమగ్ర సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 2వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు. కోస్తా జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు శుక్రవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సుకు 9 జిల్లాల కలెక్టర్లు,జేసీలు, డీఆర్‌వోలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను స్వస్తీకరించి వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణాన్ని రికార్డుల్లో భూసమగ్ర రీసర్వే పథకం ద్వారా పొందుపరుస్తారన్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ర్టారు ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. సర్వే తరవాత ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటి పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలుంటాయన్నారు.

సమగ్ర సర్వేను నిర్ణీత సమయంలోపు.. పూర్తి చేయాలని.., దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేకు అవసరమైన సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు.’డ్రోన్స్, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవాల‌న్నారు. ప్రతి అంశంలోను వేగంగా పనిచేస్తూ సమగ్ర సర్వేను పూర్తి చేయాల‌న్నారు. భూ సమగ్ర సర్వేను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సర్వే జరుగుతోంది. ఈ సర్వేను పూర్తిచేయడంతో ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంద‌ని మంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE