శిథిలమవుతున్న అనంత వారసత్వ సంపద

91

అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోనిimage-7 బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది. నేడు అనంత ఖ్యాతి కలిగిన అనంత జిల్లా పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్లుంది. జిల్లాలో శిల్ప కళా సంపద, ఆదిమ మానవుడి రాతలు గీతలు ప్రభుత్వ పరిరక్షణ లేక, చరిత్రకారుల నిర్లక్ష్యం తోడై కనుమరుగవుతున్నది. ఎనిమిది సంవత్సరాల క్రిందట కృష్ణ సత్య విగ్రహం సలకం చెరువులో తస్కరించబడింది.

రాయదుర్గంలో రాతి మంచం, హేమవతిలో మానవ ఆకారంలో శివుని విగ్రహం, కంబదూరు ఆలయంలో బ్రహ్మ కమలం, బుక్కపట్నంలో సతి, పెనుకొండలో వెలసిన ప్రశ్వనాథ్, రత్నగిరి కోట, తాడిపత్రిలో వెలసిన చింతల వెంకట రమణ స్వామి గుడి, ఏనుగు గుహలు, ఆదిమ మానవుడు గీసిన చిత్రాలు,image-8కనగానపల్లి శాసనం, విడపనకల్లు, గోరంట్లలో వెలసిన దేవాలయాలు, కుందుర్పి లో సమాధుల మీద వెలసిన 30 అడుగుల బండలు. గుత్తి, పెనుకొండ, రత్నగిరి కోటలు ఇప్పటికీ చెక్కు చెదరక చూపరులను కనువిందు చేస్తున్నాయి. లేపాక్షి, బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి, చింతల వెంకటరమణ స్వామి గుళ్లపై చెక్కిన అద్భుత శిలా సంపద.

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం. ఇక్కడ వున్న వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా “లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయా”నికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకున్నది. ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది.

పట్టణ ప్రవేశంలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళ తో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ కూడాimage-9దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యం తో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరంగా ఉంటుంది.

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని సా. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి వీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలి అని కళ్ళు తీయించుకున్నారు. ఆలయ నిర్మాణం మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు.ఈ ఆలయ నిర్మాణం ముందు ఈ స్థలం కూర్మ శైలము అనే పేరుగల ఒక కొండ ఉండేది.

ఈ కొండపైన విరూపణ్ణ పెనుగొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారముగల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు
image-10అన్యాక్రాంతమై, దురాక్రమణకు గురైనది. ఆలయం చుట్టూ షాపులు, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, చిన్న హోటళ్లు, ఫలహారాల బండ్లు, చికెన్ మటన్ షాపులు దర్శనమిస్తాయి. ప్రాకారం గోడలు ఎత్తైనవి ఉన్నాయి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు మలచారు.

ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయం పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించి వివరాలు తెలుస్తాయి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడిimage-11
లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకు గుడి బయటినుండి కనిపిస్తారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును.

ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళా చాతుర్యానికి ఒక మచ్చుతునక. గుడి 878 రాతి స్తంభాలు ఉన్నాయి, 243 వాటి పై అద్భుత శిల్పకళా ఉన్నది. 70 రాతి స్తంభాల తో ఏర్పాటు చేసిన సంగీత మందిరం పైన తైలవర్ణ చిత్రాలు రామాయణ ముఖ్య ఘట్టాలు, ఆనాటి ప్రజల జీవన విధానం అబ్బురపరచేదిగా ఉన్నది. పద్నాలుగు రాళ్లపై చెక్కిన శతపత్ర పద్మం, అజంతా తర్వాత ఇలాంటి తైల వర్ణ చిత్రాలు ఎక్కడ లభించవు.

అలాగే ఆసియాలోనే అతిపెద్ద పురాతన తైలవర్ణ చిత్రం ఇక్కడ సజీవంగా ఉంది.కొనకొండ్ల ఈ కొనకొండ్ల, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలానికి చెందిన గ్రామం. శాసనపరంగాను జరిగిన కథనం పరంగా చూస్తే కుందకుందాచార్యుడు కొనకొండ్ల దాపున గల కొండపై నివసించినట్లు బోధపడుతున్నది. ఇంద్రనంది శృతావతారం పద్మనంది అనే జైన గురువు ఇక్కడ నివసించినట్లు తెలుస్తున్నది. దీని అసలు పేరు కుంద కుంద పురం, కుందకుందాచార్యుని అసలు పేరు పద్మనంది అనియు అక్కడ లభించే శాసనాల వలన తెలుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ జైన శేషములన్నియు కొనకొండ్ల దాపున గల రససిద్ధుల గుట్టపై మనం ఇప్పటికీ చూడవచ్చును.

ఇందులో కాయచ్చర్గ భంగిమ బాగా ప్రసిద్ధి చెందినది. నిటారుగా ఏ వంపులు లేకుండా నిలబడి రెండు చేతులను మోకాలి వరకు తిన్నగా వ్రేలాడు వేయు భంగిమను కాయచ్చర్గ భంగిమ అంటారు. జిన మతానుసారం ఋషభనాధుడు, నేమినాఢుడు, మహావీరుడు మినహా మిగిలిన 21 తీర్ధంకరులు ఈ భంగిమలో సిద్ధి పొందారు. ఇక్కడ సిద్ద చక్రం చెక్కబడి ఉన్నది.రాయదుర్గం రాయదుర్గం అంటే రాజా గారి కోట. ఈ కోటదాటి ఉత్తరదిశగా 1 కి.మీ. పయనిస్తే మనకు శిద్ధుల గుట్ట వస్తుంది. ఇది అసలు జైన క్షేత్రం. ఇది యాపనీయ శాఖకు చెందిన.యాపనీయులు జైన మతాచారాల అన్నిటినీ సరళం చేసి సామాన్య ప్రజలకు సైతం ఆచరణయోగ్యంగా చేసేవారు.

అటువంటి యాపనీయ సంఘమునకు చెందిన జైన క్షేత్రం ఇది. జైన స్త్రీలను మోక్షానికి అనర్హులుగా యెంచి వారిని జైనమతంలో చేర్చుకొనకపోతే యాపనీయులు స్త్రీలు కూడా మోక్షానికి అర్హులు అని స్త్రీలు జైనమతంలో ప్రవేశం కల్పించారు.కంబదూరు ఇది కల్యాణదుర్గం తాలూకా లోనిది.ఇక్కడ ఉన్నimage-12 మల్లేశ్వరస్వామి దేవాలయం ఒకప్పటి జినాలయం. జైన వీరశైవ మత కలహాల తరుణంలో వీరశైవులు విజృంభించి ఇక్కడ ఉన్న జైన మతాన్ని ఛ్హిన్నాభిన్నం చేసిరి.అందుకే ఈ ఆలయంలో ఇంకా జైన ప్రతిమలు కనబడుతున్నవి. శిఖరం పైన పరియం కాసారం (పద్మాసనం) లో ఉన్న జైన ముని మనం చూడవచ్చు.

ఇక్కడే ఉన్న అక్కమగుడి ఆలయాకృతినిబట్టి ఇదికూడా జైనాలయం అని తెలియుచున్నది.అమరాపురం ఈగ్రామం బాలేందు మలధారి అనే జైన గురువుచే ప్రభావితమైనది.ఇతడు మూల సంఘము, దేశీయ గుణము, పుస్తక్ గుఛ్చ, ఇనగలి బలికి చెందిన జైన సంఘారామానికి గురువు.జైనమతంలో కూడా బౌద్ధమతంలో వలే అనేక సంఘారామశాఖలు కలవు. ప్రతి జైన గురువును తెలిసేటప్పుడు ఆతని సంఘము, గుణము, గుఛ్ఛము విధిగా తెలుపవలెను..పాతశివరాం ఇది మడకశిరా తాలూకాలో కలదు.

ఇక్కడ లభించిన ఒక శిలాసానంలో ఇది ఒకప్పుడు పవిత్రమైన జై న క్షేత్రంగాను, ప్రసిద్ధ జినగురువగు పద్మప్రభమలధారి దేవుని నివాసస్థలం.ఈ జై న గురువు కుందకుందాచార్యుడు రచించిన నియమ సారం వెలువడిన తత్పర్యవృత్తి గ్రంధకర్త.ఇతడు క్రీ.శ.12వ శతాబ్దానికి చెందినవాడు.రత్నగిరి ఇది విజయనగర రాజుల కాలంలో ప్రసిద్ధిగాంచిన జైన క్షేత్రం. ఇచ్చట శాంతి నాధుని దేవాలయం కలదు.ఇది చాలా పెద్దది.స్థానిక జైనులతో మరమ్మత్తులు చేయించుకొనబడినది.

శాంతి నాధుడు జైనుల 16వ తీర్ధంకరుడు.తాడిపత్రి క్రీ.శ. 12వ శతాబ్దంలో ఇది జైనుల క్షేత్రమని తెలియుచున్నది.క్రీ.శ.1198లో ఉదయాదిత్యుడనే సామంత ప్రభువు ఇచ్చటగల చంద్రనాధ పార్స్వనాధ జైనాలయానికి భూమి దానమిచినట్లు ఇక్కడ ఒక శాసనం కలదు.తొగరకుంట క్రీ.శ. 11-12వ శతాబ్దంలో ఇది జైనుల చంద్రప్రభువు తీర్ధంకరుడి క్షేత్రమని తెలియుచున్నది. ఆరవ చాళుక్య విక్రమదిత్యుడు రాజ్యం చేస్తున్న తరుణంలో ఆతని సామంతరాజు ఇక్కడ జైన ఆలయమునకు భూమిని దానం చేసినట్లు ఇక్కడ లభించిన శాసనం తెలుపుచున్నది.

పెనుగొండ ఇది ప్రఖ్యాత జైన క్షేత్రమని జైన సారస్వతంలో కీర్తించబడినది.పైగా పెనుగొండ యావద్భారతంలో గల నాలుగు జైన విద్యాకేంద్రాలలో ఒకతిగా జిన కధన,ఉలు తెలుపుచున్నవి.మిగిలిన్ మూడు ఢిల్లీ, కొల్హాపూర్, జినకంచి.విజయనగర రాజుల పాలనలో కూడా పెనుగొండ జైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అజితనాధుని, పార్స్వనాధుని బసదులను లేదా జైనలయములు ఇప్పటికీ తెలుయుచున్నవి.

అజిత నాధుడు రెండవ తీర్ధంకరుడు. ఏనుగు ఆతని లాంచనము.పార్స్వనాధుడు 23వ తీర్ధంకరుడు. ఇచట కల అజితనాధ దేవాలయం దక్షిణ శిఖరం కలిగి ఉన్నది.అంటే హిందూ దేవాలయాల శిఖరాలను పోలిన శిఖరాకృతి. ఈ అజితనాధ జైనాలయం శీఖరం మార్పు జైనమతం చివరి దశలో జరిగి ఉండవచ్చును.అదియును విజయనగర రాజులలోనే ఈ మార్పు జరిగి ఉండవచ్చును.