వీటి పేర్లూ మార్చేస్తాడేమో సారు…

నీ పేరేంటి..
ఇప్పటి పేరు తెలుసు..
కొత్త పేరు జగనన్నని అడుగు

ఏంటో ఈ పేర్ల గందరగోళం..
మారుతున్న జననేత గళం..
పనిలేని….పిల్లి తల
గొరిగిన వైనం..
ఎందుకొచ్చిన
ఈ వివాదాల దుకాణం..?
కష్టాన పెట్టుకుంటూ
సుఖాన ఉన్న ప్రాణం..!

అయినా ఈ పేర్లు
కాసుల పేర్లా..
చరిత్రలో
నిలిచిపోయే పేరాలా..
వీటి కోసం
ఇన్ని బేరసారాలా..!

గుర్తు చేస్తున్నానని
నన్ను నిందించవద్దేం..
వీటి పేర్లూ
మార్చేస్తాడేమో సారు..
జర జాగ్రత్త పడండి..
ఆ తర్వాత కన్నీళ్లు
ఒలకబోయొద్దు ఓ సేరు..
అది మన ఒళ్లోనే
ప్రవాహమై పారు..
ఈ ఇష్టారాజ్యంలో
నిరర్థకమే సుమీ
అలసిపోయిన
నీ సుమో పోరు..!

ప్రకాశం బ్యారేజీ..
వైఎస్సార్ జలకళ..

ఆంధ్రవిశ్వకళాపరిషత్తేమో
‘భారతీ’య విద్యా కేంద్రం..

స్వర్ణచతుర్భుజి
రాజారెడ్డి ఆదర్శ మార్గం..

నన్నయ్య విశ్వవిద్యాలయం
జగనన్నయ్య
తెలుగు అద్భుతాలయం..!

వైజాగ్ ఆర్కే బీచ్
జగనన్న సముద్ర!

ఈఎస్కే…