తాత.. మనువడు.. ఓ షర్మిల!

– జూనియర్ అలా.. షర్మిల ఇలా..
– తాత పేరు మార్పుపై ఎన్టీఆర్ అతి ‘తెలివి’
– ఖండించని నందమూరి వారసుడు
– మీడియాలో విమర్శల తర్వాతే పెదవి విప్పిన జూనియర్
– తన తండ్రి పేరు పెట్టినా అంగీకరించని షర్మిల
– తాతకు అవమానంపై కల్యాణ్‌రామ్ ఆగ్రహం
– ఎన్టీఆర్‌ను వైఎస్‌ రామారావుగా పేరు మార్చుకోవాలని సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం
– సోషల్‌మీడియాలో జూనియర్‌పై ఆగని ట్రోలింగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక ఊరిలో ఇద్దరు కొట్లాడుకున్నారు. ఆ వార్త రాజుగారి చెవిన పడి ఇద్దరినీ కచేరీకి పిలిపించారు. ఎందుకు కొట్టుకున్నారు? కొట్లాటకు కారణమేమిటని గద్దించారు. దానితో ఇద్దరూ నీవంటే నీవే కారణమని రాజు గారి ఎదుటే వాదనకు దిగారు. ఇహ లాభం లేదనుకున్న రాజు గారు కొట్లాడుకున్న స్థలంలో ఉన్న కిరాణాషాపు వాడిని పిలిపించారు. వీళ్లిద్దరు కొట్లాడుకోవడం నువ్వు చూశావా? అని వాకబు చేశారు. దానితో ఇరుక్కుపోయిన షాపు వాడు కాసేపు ఆలోచించాడు. ఇద్దరూ తనకు కావలసిన వాడే . ఒకడు తనకు బంధువు. ఇంకొకడి వల్ల తనకు బోలెడు పనులూ, లాభమో ఉంది. కాబట్టి ఇద్దరినీ దూరం చేసుకోవడం కష్టం. మరిప్పుడెలా అని ఆలోచించాడు. వెంటనే ‘మహాప్రభూ.. వీరిద్దరూ కొట్టుకున్న మాట నిజం. కానీ ఎవరు ముందన్నది చూద్దామని ప్రయత్నిస్తే పెద్ద గాలి వాన వచ్చింది. కాబట్టి దానిని చూడలేకపోయా’ అని చావుకబురు చల్లగా చెప్పాడు. షాపువాడిని అతి తెలివి, లౌక్యాన్ని రాజుగారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత ఈసారి కొట్లాడుకుంటే సహించేది లేదని హెచ్చరించి ఇద్దరినీ పంపించేశారు.

చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర చదివిన వారందరికీ తెలిసిన కథ ఇది. మనిషి సమస్య వచ్చినప్పుడు ఎంత లౌక్యంగా వ్యవహరించగలడన్న నీతి చెప్పే ఆ కథను, జూనియర్ ఎన్టీఆర్ బహుశా తన చిన్నప్పుడెప్పుడో చదివి ఉండాలి. లేకపోతే.. బోలెడంత ప్రిస్టేజీ యవ్వారమయిన తాతపేరు మార్పుపై.. బుడ్డోడు అంత నేర్పుగా- అతి లౌక్యంగా అతి తెలివిగా ట్వీటి ఉండేవాడు కాదు. కర్ర విరక్కుండా-పాముimage-13 చావకుండా అనే సామెతను వినడమే తప్ప, మనమెవరం చూసి ఉండం. కానీ నందమూరి వంశోద్ధారకుడు, తాత ఎన్టీఆర్‌ను ప్రతి ఏడాది ఫుల్‌పేజీ అడ్వర్టయిజ్‌మెంట్లలో స్మరించుకునే జూనియర్ ఎన్టీఆర్, దాన్ని ఆచరించి చూపడమే ఇక్కడ విశేషం.

బెజవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివ ర్శిటీ పేరును.. వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ, ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రచ్చ అవుతోంది. తెలుగుదేశం వారంతా దానిని ఖండిస్తూ రోడ్డెక్కారు. సీఎం దిష్టిబొమ్మలు తగులపెట్టారు. అయినా జగనన్న కొలువులో ఉన్న అన్న గారి రెండో భార్య లక్ష్మీపార్వతి గానీ, అన్న గారి మనుమడు లేబిలుతో సిన్మారంగాన్ని ఉద్ధరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గానీ స్పందించలేదు. ఎన్టీఆర్‌ను సదా స్మరించే గుడివాడ నాని, అన్నగారి పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చిన తమ్మినేని సీతారాం గానీ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గానీ స్పందించిన దాఖలాలు లేవు. కానీ అధికార భాషా సంఘం అధ్యక్షుడయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాత్రం వెంటనే తన పదవికి రాజీనామా చేసి, మౌనంగా ఉన్న వారందిరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇక్కడ మరో విశేషమేమిటంటే.. అన్న ఎన్టీఆర్ కుటుంబంతోగానీ, ఆ పార్టీతో గానీ ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్ కుమార్తె షర్మిల మాత్రం.. తన అన్న జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం! ‘పేరు మార్చకూడదు. దానిపవిత్రత పోతుంది.ఒకపేరు పెట్టారు. ఆ పేరును తరతరాలు కంటిన్యూ చేస్తే వాళ్లకుimage-15

దివంగత ఎన్టీఆర్ మనువడు, హరికృష్ణ కుమారుడయిన నందమూరి కల్యాణ్‌రామ్ కూడా ఈ వ్యవహారంలో, తన తాతకు జరిగిన అవమానంపై ఘాటుగానే స్పందించారు. ‘ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీIMG-20220923-WA0015 25 ఏళ్లకుపైగా ఉనికిలో ఉన్న, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలామందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం చాలా తప్పు’ అని సూటిగా స్పందించారు.

ఇక ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం లేని.. నారా కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ కూడా, ఎన్టీఆర్ పేరు మార్పును తీవ్రంగా ఖండించారు. ఆయన కూడా నేరుగానే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం, పాము చావకుండా కర్ర విరక్కుండా అన్న సామెత కూడా ఈర్ష్యపడేలా.. అతి లౌక్యం -అతి తెలివితోపాటు, ప్రాప్తకాలజ్ఞత-స్థితప్రజ్ఞత జమిలిగా కనిపించింది. ఇంతకూ తారకరాముడు తాత పేరు మార్చినందుకు అగ్గిరాముడయ్యారనుంటున్నారా? తాతను అవమానించినందుకు మూడోకన్ను తెరిచారనుకుంటున్నారా? తాతను అవమానిస్తారా.. ఇదే నా శపథం అని పిడికిలి బిగించారనుకుంటున్నారా? అదేదో మీరే చూడండి.

‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈరకంగా ఒకరిపేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో వారి జ్ఞాపకాలను చెరిపివేయలేవు’.. ఇదీ జూనియర్ అతి లౌక్యం-అతి తెలివితో ట్వీటిన ట్వీట్. అంటే ‘‘మీరు పేరు తీసేసినా.. అన్నగారికొచ్చిన నష్టమేమీలేదన్నది’’ ఎన్టీఆర్ కవి హృదయంగా అర్ధం చేసుకోవాలి. – అది కూడా, ఎన్టీఆర్ పేరు మార్పుపై జూనియర్ స్పందించలేదంటూ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తర్వాత మాత్రమే!

కొద్దికాలం క్రితం జాతీయ రాజకీయాల్లో.. ప్రధానంగా కాంగ్రెస్ కష్టాల్లో పడినప్పుడల్లా ఆదుకునే మాజీ రాష్ట్రపతి, ట్రబుల్ షూటర్‌గా పేరున్న దివంగత ప్రణబ్‌ముఖర్జీని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీటుతో గుర్తుచేశారు. ప్రణబ్ డ్రాఫ్టును ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవచ్చు. అందులో సూటి పరిష్కారమేమీ ఉండదు. రాష్ట్ర విభజనలో ‘ప్రణబ్ పాండిత్యం’ అందరూ చూసిందే. ఇప్పుడు జూనియర్ కూడా, ప్రణబ్‌ను చంపకుండా పుట్టినట్లు కనిపించారు.

ఎన్టీఆర్ ట్వీట్‌లో ఎక్కడా తన తాత పేరు మార్చినందుకు కించిత్తు కోపం గానీ, రవంత రోషం గానీ, అణువంత అసంతృప్తిగానీ ప్రదర్శించినట్లు భూతద్దం వేసి వందసార్లు చదివినా కనిపించదు. అలాగని జగనన్న నిర్ణయాన్ని స్వాగతించారా అంటే అదీ కనిపించదు. కాకపోతే వైఎస్‌ను మహానుభావుడిని చేశారు. పోనీ మీరు ఊరకపోరని జగనన్న సర్కారుకు శాపనార్ధాలు, నిష్ఠూరాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. అలాకాకుండా, ‘మీపాపాన మీరే పోతారని’ అమ్మలక్కలు కుళాయిల దగ్గర మెటికలు విరిచే పద్ధతీ కనిపించలేదు.

మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తాత పేరు పెట్టుకుంటామన్న ఆశావాదమూ కనిపించదు. పోనీ మా తాత పేరు మార్చినందుకు, నేను ఫలానా తేదీ నుంచి నిమ్మకూరులో ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానన్న హెచ్చరిక అసలే లేదు. అంతకాకపోయినా, తన శిష్యుడు కొడాలి నానితో కలసి గుడివాడ రిక్షాసెంటర్‌లో నిరసన దీక్షకు దిగుతానన్న బెదిరింపూ లేదాయె. మరి జూనియర్ ఎందుకు ఆ ట్వీటు ట్వీటిందీ ఎవరికీ అర్ధం కాదు. ప్రతిఘటన’ సినిమాలో కోట శ్రీనివాసరావు గుండు గోక్కుంటూ, ‘వీడు నన్ను తిడ్తాండా? పొగుడ్తాండా’ అన్నట్లు.. ఈ ట్వీటులో జూనియర్, జగన్ నిర్ణయాన్ని విమర్శించారో- సమర్ధించారో అర్ధం కాక తెలుగుతమ్ముళ్లు జుట్టు పీక్కుంటున్నారు. ‘అసలు ఎన్టీఆర్’ కారణ జన్ముడయితే.. ఈ కొసరు ఎన్టీఆర్ మాత్రం, ఉత్తి ‘తారక జన్ముడ’న్నది ఇప్పుడు ‘అసలు ఎన్టీఆర్’ అభిమానుల వ్యాఖ్య.

దాన్నలా ఉంచితే.. ఎన్టీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో, ఆయన హీరోయిజాన్ని, ‘నందమూరి కారు’్డను వెక్కిరించేలా మారింది. అన్న గారి అభిమానులతోపాటు, కమ్మ సామాజికవర్గం కూడా ఎన్టీఆర్ సారం లేని ట్వీట్ సారాంశాన్ని తెగ ట్రోల్ చేస్తోంది. ఆ మేరకు గతంలో ఆయన నటించిన కొన్నిimage-14 సన్నివేశాల వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టింది. దానితోపాటు.. ‘నువ్వుకూడా రేపటినుంచి వైఎస్ రామారావు’ అని పెట్టుకోమంటూ గ్రాఫిక్ ఫొటోలు పెట్టి మరీ దీవిస్తున్నారు.

సీత బాధలు సీతవి. పీత బాధలు పీతవ న్నట్లు.. బుడ్డోడి కష్టాలు బుడ్డోడివి. చెప్పేవాళ్లకేం? బోలెడు చెబుతారు! తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాట్ట వెనుకటికెవరో వెంకట్రావు!! అసలే బోలెడు సినిమాలు చేతిలో ఉన్నాయి. అవి రిలీజయినప్పుడు అక్కడ ఏపీలో జగనన్న.. వాటికి ఎక్స్‌ట్రా షో, ఎక్స్‌ట్రా రేట్లకు పర్మిషను ఇవ్వాలి. లేకపోతే ప్రొడ్యూసర్లకి బొచ్చెలో రాయి! అంతేనా? ఇటు చూస్తే పిల్లనిచ్చిన మాంగారేమో జగనన్న పార్టీలో ఉన్నారు.

అమ్ముమ్మో, నాయనమ్మో తెలియని లక్ష్మీపార్వతిని పక్కనబెట్టినా.. తన సుఖమే కోరుకునే తన శిష్యపరమాణువులయిన కొడాలి నాని, వంశీలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు తాను చనిపోయిన తాత కోసం కన్నెర్ర చేస్తే , ఇక్కడ తన పరిస్థితి ఉగ్గాని బజ్జీనే కదా? అందుకే తారకరాముడు ట్వీట్‌లో ‘ఆవిధంగా ముందుకువెళ్లారన్న మాట’. హలో తెలుగు తమ్ముళ్లూ.. మీకు అర్ధమవుతోందా?
ntr

Leave a Reply