Suryaa.co.in

Andhra Pradesh

రూ. 20 లక్షల గార్మెంట్ సామగ్రి వైసీపీ సానుకూల పరుల చోరి!

• వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ
• భూ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల విన్నపం
• అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన నేతలు

మంగళగిరి: దొంగతనంగా తన ఫ్యాక్టరీలోకి ప్రవేశించి రూ. 20 లక్షలు విలువ చేసే గార్మెంట్ తయారీ సామగ్రిని వైసీపీ సానుకూల పరులు కొట్టేశారని.. వారిపై నాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పట్టించుకోలేదని.. వారికి వైసీపీ నేతలు సపోర్ట్ రావడంతో కేసును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారని.. దాంతో తాను అప్పులు తెచ్చి కొన్న సామాన్లకు డబ్బులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. తిరుపతి భవానీ నగర్ కు చెందిన ఎస్. అజీమ్ బాషా కోరారు. తన సామాన్లు దొంగిలించిన కె. విజయారెడ్డి, కె. మునిరత్నంరెడ్డి, కె. మునీంద్రారెడ్డిల పై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులు తిరిగిని ఇప్పించాలని అజీమ్ బాషా గురువారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో కోరారు. నేతలు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిష్వంత్ లకు వినతి ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• కడప జిల్లా చక్రాయపేట మండలం చిలేకాంపల్లే గ్రామానికి చెందిన చంద్రమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త ద్వారా తనకు సంక్రమించిన భూమికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నా.. వైసీపీ నేతలతో అధికారులు కుమ్మక్కై తన భూమికి 1B అడంగల్ రాకుండా అడ్డుకున్నారని.. దయ చేసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చల్లారి సత్యనారాయణ విజ్ఞప్తి తమ ఆధీనంలో ఉండి పన్ను కడుతున్న భూమికి వైసీపీ నేతలు పొట్లూరి సత్యనారాయణ, చల్లారి శివనాగ మల్లేశ్వరరావు, చల్లారి వీరరాఘవులు, రాజులపాటి ముసలయ్యలు దొంగకా పత్రాలు సృష్టించి తమను భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
• గత వైసీపీ ప్రభుత్వం తాను టీడీపీ కార్యకర్తనని తాను 2014 -19 టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనుల్లో భాగంగా తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు గ్రామ పంచాయతీ అరలిగుంటలో చేపట్టిన వర్క్ పనులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. వాటిని విడుదల చేసి తనను ఆదుకోవాలని సీఎస్. రాజేంద్ర నాయుడు వేడుకున్నారు.
• తెనాలికి చెందిన యార్లగడ్డ వెంకటెశ్వర్లు అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. హ్యాపీ ఫీచర్ మల్టీ పర్పస్ కోపరేటీవ్ సొసైటీలో గుంటూరు రీజనల్ ఆఫీసు నందు తాను రిటైర్డ్ అయిన డబ్బులు రూ. 6,20,000 లు దాచుకుంటే అక్కడి అధికారులు వాటని కొట్టేసి తమకు తెలియదని చెబుతున్నారని.. దయచేసి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి సాయం చేయాలని వేడుకున్నారు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మహ్మద్ లియాకత్ ఆలి విజ్ఞప్తి చేస్తూ.. తమ తండ్రికి రెవెన్యూ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కేటాయించిన భూమి అన్యాక్రాంతం అయ్యిందని అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని తమ భూమి తకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE