ఆర్.ఎస్.ఎస్.
భారతదేశంలో అర్.ఎస్.ఎస్.కు, కమ్యూనిజమ్కు వందేళ్లు. వందేళ్ల ఆర్.ఎస్.ఎస్., కమ్యూనిజమ్ ఈ రెండిటినీ ఇప్పుడు మామూలు దృష్టితో అవలోకిస్తే, మానసిక రోగానికి, ఉన్మాదానికి, బుద్ధి దోషాలకు అతీతంగా ఈ రెండిటి గురించీ ఆలోచన చేస్తే ‘ఆర్.ఎస్.ఎస్. విజయవంతమైంది; కమ్యూనిజమ్ విఫలమైంది’ అన్న క్షేత్రవాస్తవం ప్రస్ఫుటం ఔతుంది! అన్ని అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, దుష్ప్రయత్నాలకు అతీతంగా ఆర్.ఎస్.ఎస్. విజయవంతమవడం కమ్యూనిజమ్ ఘోరంగా విఫలవడం కాలంలో బలంగా నమోదైంది!! ఇది దాచేస్తే దాగని సత్యం; ఇది నెలకొన్న సత్ఫలితం.
మూలం
‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ పేరులోనే లక్షణాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తూ మన మట్టి కోసం, మన మట్టితనంతో, మన మట్టి తత్త్వంతో, మన మట్టి మనుషుల కోసం, మన మట్టిలో, మన జాతీయతా సత్వంతో, భారతీయతా తత్త్వంతో పనిచేస్తోంది. భారతీయతా భావాల, జాతీయతా భావాల ఆర్.ఎస్. ఎస్.కు మూలం దేశ తొలిదశ స్వాతంత్ర్య సమర యోధులైన శ్రీ అరవిందుల వారిలో కనిపిస్తుంది! ఇంకా పైకి వెళితే స్వామి వివేకానందులవారిలో మనకు ఆర్.ఎస్.ఎస్.కు మూలం ద్యోతకమౌతుంది.
పెనుమేలు
కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చేతిలో దేశ ప్రజల అవసరాల కోసం 27 సెప్టెంబర్ 1925 లో ‘సంఘ్’ పేరుతో శ్రీకారం చుట్టుకుని 27 సెప్టెంబర్ 1926న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అయింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో ఉత్పన్నమైన అత్యున్నతమైన ప్రజాహితకరమైన ఉద్యమం. ఆర్.ఎస్.ఎస్. ఆవిర్భావం మనదేశానికి జరిగిన పెనుమేలు; ఆర్.ఎస్.ఎస్. మనదేశంలో జరిగిన గొప్ప పరిణామం.
కమ్యూనిజమ్లాగా ఆర్.ఎస్.ఎస్. విదేశీ విధ్వంసక భావజాలం కాదు. విదేశీ ధనంతోనూ, విదేశీ మతాల, విదేశీ మాఫియాల ప్రోద్బలంతోనూ ఆర్.ఎస్.ఎస్. ఏర్పడలేదు, ఎదగలేదు. ఎన్నో కుట్రలను, ఎన్నో దాడులను ఎదుర్కొని, అతి భయంకరమైన దేశ విరోధ శక్తుల కుయుక్తులను ఎదుర్కొని శిక్షణతో, క్రమశిక్షణతో ఆర్.ఎస్.ఎస్. అంచెలంచెలుగా ఎదిగింది. కమ్యూనిజమ్కు, కమ్యూనిజమ్లో శిక్షణ, క్రమశిక్షణ లేవు; ఉండవు.
భయంకరమైన కుట్ర
దేశంలోని పెద్దశాతం ప్రజలైన, దేశ నిజ సంతతి అయిన హిందువుల్ని తృతీయశ్రేణి పౌరుల్ని చేసి నలిపేసే భయంకరమైన కుట్రగా కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో సచ్చర్ కమిటి ప్రతిపాదనలను చట్టబద్ధం చెయ్యాలని గట్టిగా ప్రయత్నించినప్పుడు ఆర్.ఎస్.ఎస్. భావజాల భారతీయజనతా పార్టీ ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసింది.
2011, 2013లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ హిందువుల్ని దారుణంగా దెబ్బకొట్టే ప్రయత్నంగా, హిందువుల్ని విదేశీ మతాలకు బానిసలుగా చేసే మరో భయంకరమైన కుట్రగా కమ్యూనల్ వైలన్స్(violence) బిల్ తెస్తే దాన్ని అమలులోకి రాకుండా చేసి ఆర్.ఎస్.ఎస్. భావజాల భారతీయజనతా పార్టీ దేశంలోని పెద్ద శాతం ప్రజ అయిన హిందువుల్ని రక్షించింది. ఆర్.ఎస్.ఎస్.వల్ల దేశ ప్రజకు జరిగిన నిరుపమానమైన మేళ్లు ఇవి.
ప్రజాప్రభుత్వంగా
ఆర్. ఎస్.ఎస్. సమర్థులైన పాలకులను దేశానికి అందించింది. దశాబ్దికి పైగా ప్రజా ప్రభుత్వంగా బీ.జే.పీ. రూపంలో దేశ పరిపాలన చేస్తున్నది ఆర్.ఎస్.ఎస్. స్ఫూర్తి; ఆర్.ఎస్.ఎస్. తత్త్వం; ఆర్.ఎస్.ఎస్. సత్వం. దేశ ప్రజలు కోరుకుని ఎన్నుకున్న ఆర్.ఎస్.ఎస్. దృక్పథం, పనితీరు ఇవాళ దేశాన్ని మునుపెప్పుడూ లేనంత పటిష్టంగా పరిపాలన చేస్తోంది. భవిష్యత్తులోనూ పెద్దశాతం ప్రజ అయిన హిందూ ప్రజాప్రభుత్వం పరిపాలన చేస్తూండేందుకు ప్రాతిపదిక, బాట వేసింది ఆర్.ఎస్.ఎస్.
విదేశీ మతోన్మాద, విదేశాల మాఫియాల, విధ్వంసక భావజాలాల దుష్టశక్తుల నుంచి దేశాన్ని ఆర్.ఎస్.ఎస్. రక్షించుకుంటునే ఉంటుంది. దేశంలో ఏ ప్రకృతి విలయం వచ్చినా మతోన్మాదానికి అతీతంగా స్వచ్ఛందంగా ‘సేవ’ చేస్తుంది ఆర్.ఎస్.ఎస్. ఏ విపత్కర పరిస్థితిలోనూ ఆర్.ఎస్.ఎస్.లాగా కమ్యూనిజమ్ క్షేత్ర స్థాయిలో ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవు.
కమ్యూనిజమ్
దేశంలో వందేళ్ల కమ్యూనిజమ్ ఇవాళ పూర్తిగా శిధిలమైపోయింది! స్వదేశీయమైనది కానిది, విదేశీ విద్వేషవాదం, విధ్వంసక భావజాలం కమ్యూనిజమ్. సగటు పౌరుడికి, సమాజానికి, చరిత్రకు కమ్యూనిజమ్ భయంకరమైన గాయం చేసి, చేసి పెనుమచ్చగా దేశంలో మిగిలి ఉంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా కమ్యూనిజమ్ మట్టి కొట్టుకుపోయింది. ప్రపంచంలో కమ్యూనిజమ్ సమసిపోవడం ఒక అనివార్యమైన సరైన చారిత్రిక పరిణామం!
కా(ర్)ల్ మార్క్స్
కమ్యూనిజమ్ లేదా మార్క్సిజమ్. ప్రపంచ అధ్యయనంగా కా(ర్)ల్ మార్క్స్ గురించి తెలియజేస్తూ CHAMBERS BIOGRAPHYICAL DICTIONARY ఇలా రాసింది: “చాల వరకు అతడి (మార్క్స్) నిర్దిష్టమైన సూచనలు, సిద్ధాంతాలు చారిత్రికంగా తప్పైపోయాయి. (falsified అని మూలం… అంటే అబద్ధం అయిపోయాయనీ, బూటకమైనవైపోయాయనీ, మోసపూరితమైనవైపోయాయనీ కూడా పరిగణించచ్చు) అటుపై మార్క్సిజమ్, ఆచరణలో పదేపదే అసహ్యకరమైన సామాజిక, రాజకీయ వికారాలకు (లేదా చిక్కులకు) దారి చూపించింది…” ఇలా చారిత్రిక వాస్తవాన్ని చెప్పాక “మార్క్సిజమ్ను అంటిపెట్టుకునున్న సెక్యులర్స్ ఏ మత, రాజకీయ తెగలవాళ్ల కన్నా ఎక్కువ మందే ఉన్నారు” అనీ చెబుతోంది. (ఇంగ్లిష్ మూలం: Many of his predictions and doctrines have been falsified by history, and ‘Marxism’ has been shown in practice often to have abhorrent social and political implications; but his general theories still exert an enormous influence on social science, and the secular adherents of ‘Marxism’ continue to outnumber the followers of almost any other religious or political ceed.) ఇదిగో ఈ స్థితే మన దేశానికి పెనుహానికరం ఐంది; ఔతోంది; ఔతుంది.
క్షేత్ర వాస్తవం
‘పదేపదే అసహ్యకరమైన సామాజిక, రాజకీయ వికారాలకు దారి చూపించింది’ అని మార్క్సిజమ్ గురించి అంతర్జాతీయ అధ్యయనం తెలియజేస్తున్న క్షేత్ర వాస్తవాన్ని మనం అవగతం చేసుకోవాలి. మార్క్సిజమ్ గురించి అంతర్జాతీయంగా చెప్పబడుతున్నదాన్ని మనం సరిగ్గా ఆకళింపు చేసుకుందాం; కమ్యూనిజమ్ నుంచి మనల్ని, మన సమాజాన్ని మనం కాపాడుకుందాం.
నిజమైన కమ్యూనిజమ్
నిజమైన కమ్యూనిజమ్ ఏనాడూ లేదు.
Oxford reference dictionary ఈ విషయాన్ని “Communism has taken different forms…” అని చెబుతూ సుస్పష్టం చేస్తోంది.
ఎన్నో రూపాంతరాల్లో నిజమైన కమ్యూనిజమ్ ఎక్కడుందో? ఎప్పుడుందో? ఎలా ఉందో? ఈ ప్రశ్నలకు జవాబులు చరిత్రలో ఉన్నట్టు లేదు. కమ్యూనిజమ్ అన్న మాట మాత్రమే ఉండేది; అది ఇంకా కూడా కాస్త మిగిలి ఉంది. Does the original form of communism exist? If at all, where is that?
అంతర్జాతీయ అధ్యయనం
Oxford reference dictionary ఒక అంతర్జాతీయ అధ్యయనంగా కమ్యూనిజమ్ అన్నదానికి రూపాంతరాలు ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది. మనకు తెలియవస్తున్న కొందరు కమ్యూనిస్ట్ ‘మేధావులు’ ఏదో ఒక రూపాంతరానికి చెందిన వాళ్లు. వాళ్లనూ, ఆ రూపాంతరాల్నీ దాటుకుని అసలు కమ్యూనిజమ్ ఏది అని ఆలోచన చేస్తే రూపాంతరాల్లో తనను తాను ఎప్పుడో పోగొట్టుకుంది కమ్యూనిజమ్ అన్నది తేటతెల్లం ఔతుంది. కమ్యూనిజమ్ ఎన్నో రూపాంతరాల్ని పొందింది. మూల కమ్యూనిజమ్ ఉందా? చచ్చిపోయిందా? Now the so called communists should know and learn the original form of communism in order to realise that they are the real communists.
పిండంలోనే చెదిరిపోయిన సిద్ధాంతం
–
“కమ్యూనిజమ్ సహజత్వానికి వ్యతిరేకమైనది; అది పిండంలోనే చెదిరిపోయిన సిద్ధాంతం; నేను కా(ర)ల్ మార్క్స్‌ను వ్యతిరేకిస్తున్నాను, అతడు ఏమీ చెయ్యలేదు; కమ్యూనిజమ్ సామాన్యుల ఆలోచనల నుంచి పుట్టింది కాదు” అంటూ సత్యాన్ని చాల గట్టిగా, మానసిక రోగానికి అతీతంగా చెప్పారు ఓషో (రజనీష్). కమ్యూనిజమ్ ప్రపంచానికి ‘పనికిరాలేదు’ అనీ, ‘పనికిరానిది’ అనీ, ‘పనికిరాదు’ అనీ చరిత్ర తెలియజేస్తోంది.
కొన్ని దేశాల్లో కమ్యూనిజం అని ఉన్నది కమ్యూనిజం కాదు. మరేదో ఆ పేరుతో చలామణి అవుతోంది. Communism has amounted to an out and out falsity. ‘కమ్యూనిజమ్ సామాన్యుల ఆలోచనల నుంచి పుట్టలేదు; కమ్యూనిజమ్ సామాన్యుల కోసం కాదు’. అంతర్జాతీయ అధ్యయనాలు ‘కమ్యూనిజమ్ ఒక మానసిక రుగ్మత’ అని విరివిగా తెలియజెబుతున్నాయి.
అంబేడ్కర్
————–
బౌద్ధంలాగా కమ్యూనిజమ్ ఈ మట్టికి (జాతికి) వ్యతిరేకంగానే ఉంది! పుష్యమిత్ర శుంగుడి లేదా పుష్పమిత్ర శుంగుడి (BCE 185-149) కాలం నుంచే బౌద్ధం ఈ మట్టికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. పుష్యమిత్ర శుంగుడి లేదా పుష్పమిత్ర శుంగుడి రాజ్యంలోని బుద్ధ బిక్షువులు (మహనీయుడు బుద్ధుడి స్ఫూర్తికి బౌద్ధం, బౌద్ధ భిక్షువులు పూర్తిగా విరుద్ధం) మిలిందుడు వంటి బాక్ట్రిఅన్ (Bactrian) విదేశీ రాజులకు స్వదేశ రహస్యాల్ని అమ్ముకునేవారు. దండెత్తి వచ్చే పరాయి రాజుల ప్రయోజనార్థం మట్టి లేదా రాజ్య ద్రోహులుగా పనిచేశారు అప్పటి బౌద్ధ భిక్షువులు. అందువల్లే పుష్యమిత్ర శుంగుడు ఆ బౌద్ధ భిక్షువుల్ని చంపించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనదేశంలో బౌద్ధులు దేశానికి, సంస్కృతికి, జాతికి, సమాజానికి వ్యతిరేకంగానే ఉన్నారు. బౌద్ధులలాగా కమ్యూనిస్ట్‌లు కూడా ఉండడం మనం గమనించవచ్చు. బౌద్ధులలాగా కమ్యూనిస్ట్‌లు కూడా చరిత్ర వక్రీకరణ విషయంలో నిపుణులే.
కమ్యూనిస్ట్ శక్తులు అనైతిక, అసాంఘీక, అశ్లీల శక్తులుగానూ, భ్రష్టత్వంతోనూ ఉండడం మనకు తెలిసిందే. బౌద్ధ శక్తులూ ఇలాంటివే. మనదేశంలో కొన్నేళ్ల క్రితం తీక్ష్ణమైన కమ్యూనిస్ట్‌లుగా ఉన్న కొందరు ఇప్పుడు బుద్ధిస్ట్లుగా మారారు. ఇది ఒక సహజ పరిణామం. భ్రష్టత్వం కారణంగానూ, చదువు, విజ్ఞత లేకపోవడంవల్లానూ, బుద్ధి వక్రత వల్లానూ, సమాజంపై విద్వేషంవల్లానూ, మానసిక రుగ్మతవల్లానూ ఈ పరిణామం జరిగింది. బౌద్ధాన్ని తీసుకున్నా అంబేడ్కర్ కమ్యూనిజాన్ని నిరాకరించారు; తిరస్కరించారు! అంబేడ్కర్ కమ్యూనిజం దేశానికి హానికరం అన్న తెలివిడి ఉన్నవారు.
విధ్వంసకర భావజాలం
విదేశీ విధ్వంసకర భావజాలంగా, కార్యాచరణగా సుత్తి, కొడవలితో మనదేశానికి వచ్చిన కమ్యూనిజమ్ దేశానికి, సామాన్యులకు అతి తీవ్రమైన గాయాలను చేసింది. కమ్యూనిజమ్ మనదేశంలోని తల్లులకు పెట్టిన ‘కడుపు కోత’ అంతా ఇంతా కాదు. కమ్యూనిజమ్కు ఎందరో స్త్రీ, పురుషుల బతుకులు ఆహుతి అయిపోయాయి. కమ్యూనిజమ్వల్ల ఎన్నో పరిశ్రమలు నాశనం అయ్యాయి. తెలుగులో కవిత్వాన్ని కూడా చంపేసిన దుష్టశక్తి కమ్యూనిజమ్! ఎంతో చెప్పచ్చు కమ్యూనిజమ్ విధ్వంసం గురించి.
సంస్కార హీనంగా
మన దేశంలో తమను తాము కమ్యూనిస్టులుగా ప్రకటించుకుంటున్నవాళ్లు చవకబాఱు భాష వాడతారు; ఎందుకు? ముఖాముఖి చర్చలు చెయ్యరు; ఎందుకు? ఒక తార్కిక చింతన చెయ్యరు; ఎందుకు? దాడి చెయ్యడం అలవాటు చేసుకున్నారు; ఎందుకు? దాష్టీకం చేస్తారు; ఎందుకు? సంస్కార హీనంగా ప్రవర్తిస్తారు ఎందుకు? కమ్యూనిస్టులకు సరైన, మేలైన చదువు ఉండదు; ఎందుకు? ముఖ్యంగా ఏనాడూ వాళ్లు దేశ, సంఘ ప్రయోజనాల కోసం పనిచెయ్యలేదు సరికదా ఆ ఆలోచన కూడా చెయ్యలేదు; ఎందుకు? ఒక దేశ, ప్రదేశ ప్రయోజనాన్ని కాంక్షించనిది ఏం సాధించగలుగుతుంది? వినాశనాన్ని మాత్రమే సాధించగలుగుతుంది. అందుకే కమ్యూనిజమ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా విఫలమైపోయింది!
ఆర్.ఎస్.ఎస్., కమ్యూనిజమ్ ఈ రెండిటి మధ్య ప్రధానమైన తేడాలు ఏమిటి?
ప్రయోజనానికి ప్రమాదానికి ఉన్న తేడా; అందుకోవడానికి పోగొట్టుకోవడానికి ఉన్న తేడా; ఆలింగనానికి వెన్నెపోటుకు ఉన్న తేడా; నిర్మాణాత్మకతకు నుర్మూలనకు ఉన్న తేడా; సామరస్యానికి విద్వేషానికి ఉన్న తేడా; మేలుకు కీడుకు ఉన్న తేడా; పనిచెయ్యడానికి పాడుచెయ్యడానికి ఉన్న తేడా; ప్రగతికి పతనానికి ఉన్న తేడా; కలవడానికి విడిపోవడానికి ఉన్న తేడా; సమర్పణకు దోపిడికి ఉన్న తేడా, వైద్యానికి వ్యాధికి ఉన్న తేడా; బాగుకు భ్రష్టత్వానికి ఉన్న తేడా అర్.ఎస్.ఎస్.కూ కమ్యూనిజమ్కూ ఉన్న తేడా అని చారిత్రికంగా విశదమైపోయింది.
తేడాతనం
కమ్యూనిజమ్ ఒక ‘తేడాతనం’ అన్న వాస్తవం ప్రజలు అవగతం చేసుకున్నారు; అందుకే కమ్యూనిజాన్ని అసహ్యించుకుంటూ తరిమేస్తున్నారు! మామూలు ప్రజ, ప్రగతి శీలురు, మానసిక ఆరోగ్యవంతులు, గొప్పగా ఎదగాలనుకుంటున్నవాళ్లు, బాగా బతకాలనుకుంటున్నవాళ్లు, మంచిగా మెలగాలనుకుంటున్నవాళ్లు కమ్యూనిజమ్ను బాగా దూరం పెట్టేశారు. ఊళ్లో ఉండే మురికి కాలువలా ఇవాళ్టి కమ్యూనిజమ్ ఉంది. మురికి కాలువ నుంచి వస్తూండే భయంకర దుర్వాసనలా కమ్యూనిజమ్ నుంచి ‘చెడు’ వస్తూనే ఉంది!
మట్టికి మంట
ఇది సోషల్ మీడిఅ యుగం. ఒకప్పటిలా పత్రికల్ని, పాత్రికేయాన్ని తన చేతుల్లో పెట్టుకుని ప్రజల్ని దెబ్బకొట్టే కమ్యూనిజమ్ దుష్ట ప్రయత్నాలు ఇకపై ఫలించవు; చెల్లుబాటుకావు. కమ్యూనిజమ్ ఇక ప్రజల్ని మోసంచెయ్యలేదు; పాడుచెయ్యలేదు. ఇకపై కమ్యూనిజానికి బలైపోయే బతుకులు ఉండవు. ‘మట్టికి మంటపెట్టే’ కమ్యూనిజమ్ పన్నాగాలు ఇకపై దేశంలో పనిచెయ్యవు. భారత దేశానికి సంబంధించినంత వరకూ అసలు కమ్యూనిజమ్ అన్నదే ‘మట్టికి అంటుకున్న మంట’.
దేశం కావాలి
మన దేశానికి కావాల్సింది విదేశీ విధ్వంసక మంట కాదు. సార్వభౌమత్వం, భద్రత, సుస్థిరత, ప్రజా క్షేమం, ప్రగతి, శాంతి ఇవీ మన దేశానికి కావాల్సినవి. హిందువులకూ దేశం కావాలి; ఈ దేశం హిందువులకు కావాలి. అందుకు మనకు ఆర్.ఎస్.ఎస్. కావాలి. మన నెలవుగా మన దేశం మనకై ఉండాలి. గతంలోలా కాకుండా వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ విదేశీ విధ్వంసాలను, విద్వేషాలను, విషాలను జయించి మనమూ, మన దేశమూ రాణించాలి; రాజిల్లాలి.

9444012279