-ఏపీకి రూ.10,461 కోట్ల నిధులు.. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’గా పేర్కొంటూ విడుదల చేసిన కేంద్రం
-టీడీపీ హయాంలో స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు
-2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ
-జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాల కడుపుమంట
-బందరు పోర్టు శంకుస్థాపన మరో మైలురాయి
-వచ్చే ఏడాది రామాయపట్నం పోర్టు ప్రారంభం
-ఆనాడు చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు
-బీజేపీతో పార్టనర్‌గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు
-అవినాష్ వ్యవహారంలోనూ తప్పుడు రాతలు
-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీ విభజన హామీలను సాధించడంలో సీఎం జగన్ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన రెవెన్యూ లోటు భర్తీ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిష్కరించు కుంటోంది. తాజాగా విభజన చట్టంలోని రెవెన్యూ లోటు భర్తీ కింద పేర్కొన్న రూ.10,461 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.
ఈ ఆర్థిక సాయాన్ని 2014-15 రెవెన్యూలోటు కింద ఉన్నా ప్రస్తుతం ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’గా పేర్కొంది. ఓ వైపు సంక్షేమం మరో వైపు పారిశ్రామిక సంస్థ ఆన్ గ్రౌండింగ్ దూసుకుపోతున్న ఏపీ సర్కారుకు ప్రస్తుత రెవెన్యూ లోటు భర్తీ నిధుల విడుదల భారీ ఊరట అందించనుంది. తాజాగా విడుదల చేసిన రూ.10,460.87 కోట్లు నిధులను 2014-15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు కింద చూపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలిచ్చారు.
సీఎం గత నెల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఈ నెల 19 వ తేదీన ఆదేశాలు వెలవడగా తాజాగా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్థిక శాఖకు కేంద్రం ఆదేశించింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ నిధులను తేవడంలో చంద్రబాబు విఫలం కాగా నేడు సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల్లో ప్రధానితో చర్చలు జరిపి రూ. 10 వేల కోట్లకు పైగా రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ ఫండింగ్ ను సాధించారు. రాష్ర్ట విభజన అనంతరం ఏపీకి కేంద్రం నుంచి ఏకమొత్తంలో విడుదలైన భారీ నిధులు ఇవే కావడం గమనార్హం.
రెవెన్యూ లోటు భర్తీ.. రాష్ర్టం హక్కు.. కేంద్రం బాధ్యత
విభజన హామీల అమలులో భాగంగా రెవెన్యూ లోటు భర్తీ రాష్ర్ట ప్రభుత్వ హక్కుగా ఉందని, కేంద్రం కూడా అంతే బాధ్యతగా నిధులు విడుదల చేసిందని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంలోని రెవెన్యూ లోటు భర్తీ కింద పేర్కొన్న రూ.10,461 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉన్న రెవెన్యూ లోటు భర్తీ నిధుల విడుదలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడానికి రాష్ర్ట ప్రభుత్వం పూర్తి బాధ్యతగా పనిచేస్తోందన్నరు. రెవెన్యూ లోటు కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను హక్కుగా రాబట్టుకుంటున్నట్లు.. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా ఈ నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. సీఎం జగన్ నిధుల కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు మొదలైన తప్పుడు ప్రచారం కేంద్రం నిధులు విడుదల చేసినా ఆగట్లేదని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావడాన్ని కూడా ఎల్లో మీడియా ఓర్చుకోలేక పోతోందని, కడుపు మంటతో విష ప్రచారం చేస్తోందన్నారు.
ఎల్లో మీడియా కడుపు మంటకు మందు లేదనేది ఈ అంశంతో స్పష్టమైందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు తేలేకపోవడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా చంద్రబాబు నిధులు తెచ్చుకోకుండా స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి మంచి జరిగితే ఓర్చుకోలేని ఎల్లో మీడియా నాన్ రెసిడెంట్ ఆంధ్రాలుగా ఉంటూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని సజ్జల వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల మేనిపెష్టోను పవిత్ర గ్రంథంలా భావించి ఇప్పటి వరకు 98.5 శాతం హామీలను నెరవేర్చారన్నారు. కోట్లాది ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ సంపూర్ణంగా నిలబెట్టుకున్నారని తెలిపారు. 2019 మే 30వ తేదీన సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ పూర్తిగా ప్రజల్లోనే ఉందన్నారు.
ఈ విధానం దేశానికి ఓ దిక్సూచిలాగా నిలిచిందని, నాలుగేళ్లలో పాలనా వికేంద్రీకరణ మొదలు సంక్షేమ, సుపరిపాలన ఫలాలను లంచాలు, వివక్ష లేకుండా సీఎం జగన్ ప్రజలకు అందించారని తెలిపారు. రాష్ర్టంలో పెట్టుబడులు, రియల్ డెవలప్మెంట్ రావడానికి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు కీలకంగా నిలుస్తాయన్నారు. మచలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించారని వివరించారు.
రెండేళ్లలో మచలీపట్నం పోర్టు అందుబాటులోకి వచ్చి కోస్తా ప్రాంత గతిని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామిక విధానం.. పాలనా వికేంద్రీకరణతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏపీని దేశంలో ఆదర్శప్రాయమైన రాష్ర్టంగా నిలిపిందన్నారు. ఈ అద్భుత పాలనే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 2019 ఎన్నికల కంటే మించిన విజయాన్ని అందించనుందన్నారు.