కృత్రిమ మేధస్సు అదుపు లేకుండా పోయే అవకాశం
గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం
– నోస్ట్రాడమస్ అంచనా
(వాసు)
బ్రెజిల్ దేశానికి చెందిన పారాసైకాలజిస్ట్ అథోస్ సలోమ్‌కు ‘ లివింగ్ నోస్ట్రాడమస్ ‘ అనే మారుపేరు ఉంది. గతంలో, అతను కోవిడ్ -19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి సహా అనేక విషయాల గురించి అంచనాలు వేశారు. గతంలో ఆయన అంచనాలు నిజమని తేలింది. 2025లో జరగబోయే సంఘటనల గురించి అతను ఏమి చెబుతాడో తెలుసుకోవడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. అన్ని రోగాలను జయించే ఒక వ్యక్తి త్వరలో పుట్టబోతున్నాడన్నది తాజాగా ఆయన చెప్పిన అతి పెద్ద రహస్యం.
2024 కేవలం నాలుగు రోజులు మిగిలి ఉంది. ప్రముఖ అంథ అధ్యాత్మకవేత్త బాబా వంగా, ప్రసిద్ధ పారా సైకాలజిస్ట్ లివింగ్ నోస్ట్రాడమస్ వంటి వారి అంచనాలకు పునరుజ్జీవింపజేసే ఆసక్తితో పాటు, మున్ముందు ఏమి జరుగుతుందో అనే ఉత్సుకత పెరుగుతోంది. ఈ దార్శనికులు 2025లో ఏమి ఊహించారో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. బ్రెజిల్‌కు చెందిన పారా సైకాలజిస్ట్ అథోస్ సలోమ్, “లివింగ్ నోస్ట్రాడమస్” గా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే రాబోయే సంవత్సరానికి కొన్ని అద్భుతమైన సూచనలను చేశారు.
లివింగ్ నోస్ట్రాడమస్ గా పేరొందిన అథోస్ సలోమ్ పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తన నాలుగు అంచనాలు నిజమయ్యాయని, వచ్చే ఏడాది కూడా తాను చెప్పబోయే సమాచారం నిజమవుతుందంటున్నారు. బ్రెజిల్‌కు చెందిన 37 ఏళ్ల అథోస్ సలోమ్, కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై దాడి, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నారు.
అతను 16వ శతాబ్దపు ప్రవక్త నోస్ట్రాడమస్‌తో పోల్చుతుంటారు. అతని మరణానికి శతాబ్దాల తర్వాత అతని ప్రవచనాలు చర్చనీయాంశంగా మారాయి. వాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. అథోస్ వచ్చే ఏడాది తాను చెప్పిన ఎన్నో అంచనాలు నిజమవుతాయంటున్నారు అథోస్ సలోమ్.
లివింగ్ నోస్ట్రాడమస్” అని పిలవబడే అథోస్ సలోమ్ 2025లో జరగబోయే ముఖ్యమైన అంశాలను అంచనా వేశారు. వీటిలో జన్యుపరంగా మార్పు చెందిన మానవుల అభివృద్ధి, కృత్రిమ మేధస్సు అదుపు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉన్నాయన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో సహా ప్రధాన ప్రపంచ సంఘటనల ఖచ్చితమైన అంచనాల చెప్పి సలోమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.