శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని వాడుకోవాలని చూస్తోంది.
తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులను ఏపీ ప్రభుత్వం ఆపింది
బి ఆర్ ఎస్ హయాంలోనే పాలమూరు,రంగారెడ్డి ట్రయల్ రన్ పూర్తి
తెలంగాణ,ఏపీ రాష్ట్రాలు సమన్వయంతో ఉండాలి
క్యాబినెట్ మొత్తం ప్రధానమంత్రిని కలుస్తారా అనేది తేల్చుకోండి
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పాలమూరు,రంగారెడ్డి ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదు. డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. బి ఆర్ ఎస్ హయాంలోనే పాలమూరు,రంగారెడ్డి ట్రయల్ రన్ పూర్తి అయింది.
ఏపీ ప్రభుత్వం పాలమూరు,రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందినవాడు. పాలమూరు పేరు చెప్పుకుని డబ్బులు తెచ్చుకుని, జిల్లాను ఉమ్మడి రాష్ట్రంలో ఎండబెట్టారు. పాలమూరు జిల్లా నుండి 14 లక్షల మంది వలసలు వెళ్లారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది.
నాగార్జున సాగర్ ఎగువున ఉన్న 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉంది. 90 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసింది. తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులను ఏపీ ప్రభుత్వం ఆపింది. పాలమూరు,రంగారెడ్డి పూర్తి అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని ఏం చేయలేదు. తెలంగాణ,ఏపీ రాష్ట్రాలు సమన్వయంతో ఉండాలి ప్రధాని మోదీ పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని తాము వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. పాలమూరు,రంగారెడ్డి ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలి. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అడగాలి.
మహబూబ్ నగర్,రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు వస్తాయి. ప్రభుత్వం కక్షసాధింపులు బంద్ చేసి, పరిపాలనపై దృష్టి పెట్టాలి. యాదాద్రి టెంపుల్ లో
కొద్ది దూరం ఉన్న బ్రిడ్జిని సంవత్సరం నుండి పూర్తి చేయడం లేదు. క్యాబినెట్ మొత్తం ప్రధానమంత్రిని కలుస్తారా అనేది తేల్చుకోండి. పాలమూరు,రంగారెడ్డిపై అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి.
పాలమూరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరు. ఎవరి ప్రభుత్వంలో మేలు జరిగిందో పాలమూరు ప్రజలు గమనించాలి. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తాము. త్వరలోనే ఉమ్మడి పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి కార్యాచరణ చేపడతాము.