Suryaa.co.in

Features

ఒక సామాజిక రుగ్మత… పరమ దరిద్రమైన దురాచారం… ఘోరమైన అన్యాయం

“ఆడపిల్ల” పుట్టినప్పటినుండీ, కలకాలం ఎల్లప్పుడూ నవ్వుతూ- తుళ్లుతూ, ఆనందంగా-సంతోషంగా ఉండాలని కన్నవాళ్లు కట్టు, బొట్టు, కాటుక, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, రంగురంగుల బట్టలు…వంటి సాధారణ సహజ అలంకారాలతో, గౌరవంగా అలంకరించి ఎంతో ప్రేమతో, అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తారు.

ఆడవారికి పెళ్లికి ముందు నుండే సాధికారికంగా ఉన్న పసుపు-కుంకుమ-గాజులు- పువ్వులు-బొట్టు-కాటుక- రంగురంగుల దుస్తులు… వంటి గౌరవనీయమైన అతి సాధారణ అలంకారాలు, దురదృష్టవశాత్తూ భర్త మరణించిన వెంటనే, బలవంతంగా తీయించడం అనేది ఒక సామాజిక రుగ్మత… పరమ దరిద్రమైన, ఒక దురాచారం… ఘోరమైన అన్యాయం.

“స్త్రీ”ల పట్ల పవిత్రమైన హిందూ మతంలో ఇప్పటికీ జరుగుతున్న అంతులేని ఎన్నో హీనమైన వివక్షలలో భాగంగా, ఇంకా – ఈ రోజుకీ – ఇప్పటికీ కొనసాగుతున్న ఈ అంధ విశ్వాసాన్ని, కర్కశమైన మూఢనమ్మకాన్ని, అనవసర ఆచారాన్ని మనం నిర్దాక్షిణ్యంగా ఖండిద్దాం…! ఈ దరిద్రమైన అనాచారాన్ని, హేయమైన దురాచారాన్ని, నీచమైన అన్యాయాన్ని ఇకనైనా, మనమైనా మానేద్దాం.

ప్రతి “స్త్రీ”కీ కట్టు, బొట్టు, కాటుక, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, రంగురంగుల బట్టలు…etc. వంటి అతిసాధారణ సహజ అలంకారాలు ధరించడం ఆజన్మాంతం, కలకలం, వారికి ఉన్న ఒక జన్మ హక్కుగా గుర్తించండి… “స్త్రీ”లను గౌరవించండి… ఆడవారి ఆత్మగౌరవాన్ని దయచేసి కాపాడండి.

– పెన్మెత్స “రవిప్రకాష్” అశోకవర్మ

LEAVE A RESPONSE