– నాటి రోజుల సీన్ రిపీట్
– వినూత్న రీతిలో టౌన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాజమండ్రి లోని మున్సిపల్ టౌన్ హైస్కూల్ కు చెందిన 1987 సం. బ్యాచ్ విద్యార్థులు వినూత్న రీతిలో తమ సమ్మేళనాన్ని నిర్వహించారు. గణితం..సోషల్..సైన్స్..ఆంగ్లం, హిందీ తదితర సబ్జెక్ట్స్ ను బోధించిన నాటి తమ ఉపాధ్యాయులతో తరగతులను నిర్వహింప చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం మున్సిపల్ టౌన్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కె. రామలింగారెడ్డి తమ పూర్వ విద్యార్థులకు చక్కని సహకారం అందించారు.
నాటి ఉపాధ్యాయులు సర్వకె.మహాలక్ష్మిరావు.. డ్రిల్ మాస్టర్ సుబ్బారావు.. సుభద్రమ్మ.. త్యాగరాజు.. మాలిక్ మాస్టర్ ..ఆచార్య.. తదితరులు నాడు తాము బోధించిన సబ్జెక్ట్స్ ను బొడించడమే కాకుండా తమ అనుభూతులను నాటి తమ పూర్వ విద్యార్థులతో పంచుకున్నారు.
“రిటైర్ కాబడి ఇప్పుడు డబ్బైవ ఒడిలో వున్న మాకు నాటి రోజులను మరొక్కమారు మా ముందు ఉంచారు..మీరు అందరూ అభినందనీయులు అని తమ పూర్వ విద్యార్థులను సదరు ఉపాధ్యాయులు అభినందించారు. తరాలు మారే కొద్ది అధ్యాపక విద్యార్థుల మధ్య సంబంధాల్లో అంతరాలు చోటు చేసుకుంటున్నాయని , ఇది విచారింపతగ్గ విషయమని సదరు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత కూడా.. 1987 స.బ్యాచ్ కు సంబందించిన టౌన్ హైస్కూల్ విద్యార్థులు మా మీద గౌరవ ప్రేమ అభిమానాలు చాటుకోవడం హర్షదాయకంగా వుందని, తమ ప్రసంగాల్లో పేర్కొంటూ కంట తడిపెట్టడం, అక్కడ విద్యార్థులను కలిచి వేసింది. అలాగే ఇటీవల రచయితగా రాణిస్తున్న పూర్వ విద్యార్ధి శ్రీపాద శ్రీనివాస్ ను సదరు ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు పెరుమాళ్ సూరి.. ముడుంబై రామకృష్ణ చారి, పప్పుల గోవింద్… బుడ్డిగ రవి..గంట ప్రసాద్, మహంతి.. భువనేశ్వర్.. తదితరులు ఘనంగా సన్మానించారు. కాగా పూర్వ విద్యార్థులు ఆశపూ సత్యనారాయణ..పి.వి.వి. సత్యనారాయణ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా దేశ, విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో వున్న 1987 సం. టౌన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో , 50 వేల రూపాయల పైగా విలువ చేసే మూడు కొత్త బీరువాలను నాటి పలువురు విద్యార్థులు దారపు రెడ్డి శ్రీనివాస్.. అడపా సత్యనారాయణ.. మరియు ఉపాధ్యాయుల చేతుల మీదగా మున్సిపల్ టౌన్ హై స్కూల్ యాజమాన్యం వారికి అందచేశారు.
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పూర్వ విద్యార్ధులు రామ ఆడిటర్స్ నిర్వాహకుడు డి.వి.వి.సత్యనారాయణ.. అడ్వకేట్ తల్లాప్రగడ రాజేశ్వరరావు.. నాగులపాటి వెంకట్.. వక్కలంక నాగేంద్ర.. శ్రీపాద చంద్ర శేఖర్, కొవ్వాడ నగేష్… ఎ.రమణ.. కోరాడ గోపి తదితరులను ఉపాధ్యాయులు.. తోటి పూర్వ విద్యార్థులు అభినందించారు.
వినూత్న రీతిలో ఆదివారం నాడు జరిగిన ఈ సమావేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, 1987 సం. నాటి ఈ పాఠశాల కి చెందిన సుమారు 50 మంది విద్యార్థి ..విద్యార్థినులు పాల్గొన్నారు.