– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వ్యవసాయం పట్ల వైకాపా సర్కారు నిర్లక్ష్య వైఖరితో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడటం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. బసవపున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మొన్నటివరకూ కరువుతో ఎండిన పంటలు అప్పులు చేసి కాపాడితే, తుఫాను వచ్చి మొత్తం ఊడ్చేసింది. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. అన్నదాతలారా అధైర్యపడొద్దు, మూడు నెలలు ఓపిక పట్టండి. రైతుబంధువైన టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుంది. మీ కష్టాలు తీరుస్తుంది.