Suryaa.co.in

Features International

కొడుకు చితాభస్మం కాశీలో కలిపేందుకు స్పెయిన్ నుంచి వచ్చిన మహిళ

బనారస్ ఘాట్‌లపై విదేశీయులు కనిపించడం మామూలే కానీ.. దాదాపు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి స్పెయిన్ నుంచి కాశీకి వచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధురాలి ఉద్దేశ్యం మాములుగా లేదు.

స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రమాదంలో మరియా థెరిసా 36 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ అతడిని రక్షించలేకపోయారు. తన ఆఖరి సమయాన్ని గ్రహించి, తన అంత్యక్రియలను హిందూ పద్ధతిలో నిర్వహించి, తన చితాభస్మాన్ని కాశీలోని గంగలో నిమజ్జనం చేయాలని తన తల్లికి తన మొదటి మరియు చివరి కోరికను తెలిపాడు.

వయసు మీదపడినా, కొడుకు చివరి కోరిక గురించి ఏమీ తెలియని సందిగ్ధంలో ఉన్నా మాతృ మమత దృఢ సంకల్పం మాత్రం వదలలేదు. కొంతమంది NRI స్నేహితుల నుండి సమాచారం సేకరించి, ఆమె తన కొడుకు చివరి కోరికను తీర్చడానికి బయలుదేరింది.

ఆమె ముంబయి మీదుగా బనారస్ చేరుకుంది. అనంతరం భారతీయ దుస్తులు ధరించి కుమారుడి అస్థికలతో మణికర్ణిక ఘాట్‌కు చేరుకున్నారు. సకల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ తల్లి తన కుమారుడి చితాభస్మాన్ని ప్రవహించశ గంగా కలిపింది .. కాశీలో చితాభస్మాన్ని పోయడం ద్వారా తన కుమారుడికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని ఆ తల్లి పూర్తి విశ్వాసం, నమ్మకం తో తన బిడ్డను స్మరిస్తూ.. ‘‘శివుడు తప్పకుండా నా కొడుక్కి మోక్షాన్ని ప్రసాదిస్తాడు’’ అని ఉద్వేగంగా చెప్పింది ..

సనాతన సంస్కృతిని మన ఇష్టానుసారం ఎగతాళి చేస్తాం కానీ, అందులో ఏదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ సంఘటన. దురదృష్టవశాత్తు, విదేశీయులకు మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యత మన కంటే బాగా తెలుసు.

LEAVE A RESPONSE