దేవుడి పైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి

ఒకరోజు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి
‘ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా “‘ అని అడిగాడు.
అర్జునుడు ” అవును కృష్ణా.! అది పావురమే ” అన్నాడు.
మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.
” అబ్బే! అది పావురం కాదు.. గ్రద్దలా ఉంది చూడు చూడు ”
” అవును నిజమే అది పావురం కాదు.. అది గ్రద్దనే కృష్ణా” అన్నాడు అర్జునుడు.
కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళి కాసేపటికి ఇలా అన్నాడు.
” అర్జునా! అది గ్రద్ధ కానే కాదు.. అది చిలుక సరిగ్గ చూడు ఒక్కసారి”
“నిజమే కృష్ణా! అది చిలుకనే” అన్నాడు అర్జునుడు.
చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు.
“అయ్యో.! అది చిలుక కూడా కానే కాదు. అది కాకి అర్జునా ! ఒక్కసారి పరికించి చూడు”
” అరే! నిజమే అది చిలుక కాదు.. కాకే కృష్ణా! అన్నాడు అర్జునుడు.
కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
” అసలు నీకు బుద్ధి ఉందా..? నీకంటూ ఒక అభిప్రాయం లేదా..? సొంతంగా ఆలోచించలేవా..? నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు ” అన్నాడు.
దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
” ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను… నువ్వు ఏదంటే నేనూ అదే..! మీరు పావురమే కదా అన్నారు… నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది… నాకు అన్నీ మీరే… మీ మాటే నాకు వేదం కృష్ణా.!
ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.
దేవుడి పైన అనుమానం అక్కరలేదు… తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి..
మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది.. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు.. ఎప్పుడు మనకు ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు.. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించుదాo..

Leave a Reply