Suryaa.co.in

Political News

విద్యా వ్యాప్తికి ఓ అద్భుత వరం.. బాల్ పాయింట్ పెన్

– జాతీయ బాల్ పాయింట్ పెన్ దినోత్సవం

విద్యా వ్యాప్తికి ఓ అద్భుత వరం మన “బాల్ పాయింట్ పెన్”. 1888లో జాన్ లావుడ్ అనే శాస్త్రవేత్త ఇంక్ పెన్నును కనుగొనడం జరిగింది. ఇంక్ పెన్ను వాడుకలో వచ్చిన అసౌకర్యాల వల్ల మరో మెరుగైన పెన్ను అవసరం ఏర్పడింది.

1938లో “లాజ్లో బిరో” అనే హంగేరియన్ జర్నలిస్టు బాల్పాయింట్ పెన్నులు తొలిసారి రూపొందించడం, తర్వాత 10 జూన్ 1943న తన సోదరుడు ఇంజనీర్ “జియార్జీ బిరో”తో కలిసి బాల్పాయింట్ పెన్నును పేటెంట్ చేయడం జరిగింది. ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి ఏట జూన్ 10న ప్రపంచ దేశాలు జాతీయ బాల్పాయింట్ పెన్ దినోత్సవం పాటించడం ఆనవాయితీగా మారింది.

ఆకర్షణీయమైన రంగులు, వివిధ కళాకృతులతో నేడు బాల్ పాయింట్ పెన్నులు పిల్లలు/యువతలో చదుకోవాలనే, రాయాలనే ఉత్సుకతను ప్రేరేపిస్తున్నాయి. నేడు అందమైన బాల్పాయింట్ పెన్నులు వ్యక్తుల స్థాయిని, వ్యక్తిత్వాలను చెప్పకనే చెబుతున్నాయి. మన జేబులో చేరిన పెన్ను మన హృదయ ఉపరితలంపై నాట్యమాడుతూ మనకు సమోన్నత గౌరవాన్ని ఆర్జించి పెడుతున్నాయి. అనేక రకాల బాల్ పాయింట్ పెన్నులను సేకరించండి, వాడండి. ఆనందించండి.

ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు,
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001)
– మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ క్యాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ విశాఖపట్నం.

LEAVE A RESPONSE