Suryaa.co.in

Telangana

సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయండి

– కేటీఆర్, హరీష్‌రావు డిమాండ్
– న్యాయం చేస్తానన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాలోని విత్తన పత్తిని సాగు చేస్తున్న రైతులకు ,ఫెయిల్ ఐన సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి ని, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని,మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా సీడు పత్తి రైతులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లాలోని సీడుపత్తి రైతులకు సీడ్ కంపెనీలు చేసిన మోసం వలన వారి కుటుంబాలు రోడ్లమీదకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది.

సీడ్ కంపెనీలు రైతులకు నేరుగా సీడు విత్తనాలను ఇవ్వకుండా ఆర్గనైజర్లు అనే దళారులను నియమించుకొని ఒక సీడ్ మాఫియాగా వ్యవహరిస్తూ నోరు లేని అమాయక రైతులను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు ఈ సంవత్సరం ప్రతి ప్యాకెట్ కు గత సంవత్సరం కంటే తక్కువ ధరకు కొంటాం అని రైతులను కొత్తమోసాలకు పాల్పడుతున్నారు సీడ్ ఆర్గనైజర్లు మరియు సీడ్ కంపెనీలు.

రైతులు పండించిన సీడు పంట పాస్ అయినప్పటికి ఫెయిల్ ఐంది అని వారి పంటకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అట్టి సీడ్ పంట పాస్ అయిందా లేదా ఫెయిల్ అయ్యిందా అనే విషయం ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలో నిర్ధారణ కావాలి.

కానీ సీడ్ కంపెనీలు సొంతంగా పెట్టుకున్న GOT (Grow out Test) నిబంధనల ప్రకారం నిర్ధారణ చేసి అట్టి పంటను ఫెయిల్ ఐంది అని రైతులను మోసం చేస్తున్నారు.కానీ సీడు రైతులు వారు పండించిన పత్తి విత్తనాలను ప్రయివేట్ ల్యాబ్ లలో టెస్ట్ చేపిస్తే పాస్ ఐనట్టు నిర్దారణ జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని సీడుపత్తి రైతులు పండించిన సీడ్ పంటకు న్యాయం చేయాలని, అవసరం ఐతే ఒక ప్రత్యేక చట్టం చేసి డిమాండ్స్ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

పంటకు డబ్బు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రైతుల సమస్యలు విన్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించి వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావు కి, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కి రైతుల ముందే ఫోన్ చేసి..జిల్లా కలెక్టర్ తక్షణమే సీడు పత్తి కంపినీల ప్రతినిధులను, రైతులను కలిపి మీటింగ్ పెట్టించి తక్షణమే సీడు కంపెనీలతో రైతులకు వారు పండించిన పంటకు డబ్బు ఇప్పించాలని కోరారు.

రైతులు అధైర్యపడకండి :హరీష్ రావు

రైతులు అధైర్యపడకండి అని మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ, కెసిఆర్ అండగా ఉంటారు అని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్యపై మాట్లాడుతానని ప్రభుత్వానికి లెటర్ రాస్తానని మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని గద్వాల జిల్లా సీడు రైతులకు హామీ ఇచ్చారు.

న్యాయం చేస్తా: రైతు కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లాలోని సీడుపత్తి రైతులు పండించిన సీడ్ పంటకు న్యాయం చేయాలని అవసరం ఐతే ఒక ప్రత్యేక చట్టం చేసి మమ్మలను ఆదుకోవాలని రైతు కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి ని వేడుకున్న గద్వాల రైతులు.

కోదండరెడ్డి స్పందిస్తూ రైతు కమీషన్ సభ్యులను, అధికారులను పిలిపించి గంటకు పైగా రైతుల సమస్యలు విని నోట్ చేసుకొని మీ సమస్యను ఈనెలాఖరున వచ్చే కొత్త వ్యవసాయ సీడ్ చట్టం ముసాయిదా లో పొందుపరచి నూతన చట్టంలో పొందుపరుస్తామని తద్వారా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలోని సీడ్ కంపెనీలు సీడ్ విత్తనాలను రైతులకు ఆర్గనైజర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ వ్యవసాయ శాఖనుంచి పంపిణీ చేయాలి. రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను పాస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనే వివరాలు ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను ద్రువీకరించాలి. జిల్లాలోని సీడ్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసిన ప్రతి రైతు సీడ్ పత్తివిత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలోనే రీ శాంపిల్ చేపించి పరీక్షలు నిర్వహించి వాస్తవ ఫలితాలను రైతులకు ఇవ్వాలి.

సీడ్ కంపెనీలు రైతులకు పంట పెట్టుబడికి ఇచ్చిన మొత్తానికి ఆర్గనైజర్లు వడ్డీని వసూలు చేయరాదు. గత సంవత్సరంలో ఏ రకంగా ఐతే ప్రతి ప్యాకెట్ కు ధర ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే ధరను చెల్లించాలి.

సీడ్ పత్తి సాగు చేసే రైతులకు సీడ్ కంపినీలకు జిల్లా స్థాయిలో కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఒప్పందం చేపించి రైతులకు గ్యారెంటీ ఇచ్చి నమ్మకం కల్పించాలి. డీఎన్‌ఏ పరీక్షలు చేపించి మోసం చేసిన అన్ని సీడ్స్ కంపినీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని గద్వాల జిల్లాలో అట్టి కంపినీనలను నిషేదించాలని పై రైతులకు రావలసిన పంట డబ్బులు ఇప్పించాలని జిల్లా సీడ్ పత్తి రైతుల తరుపున విజ్ఞప్తి చేస్తున్నాము.

తెలంగాణలోని జిల్లాలలో సీడు ఉత్పత్తి జరిగే మండలాలలో మండల వ్యవసాయ అధికారికి సీడు ఉత్పత్తి చేసే కంపెనీల,రైతుల వివరాలు ఉండాలి.

LEAVE A RESPONSE