సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్
పరవాడ: ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు సెప్టెంబర్ 24 నుండి ఓపి అక్టోబర్ 10 నుండి ఎమర్జెన్సీ సేవలు అన్ని బంద్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
గురువారం ఆయన పరవాడలో సిఐటియు సమావేశంలో మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య సేవలు బంద్ కావడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అత్యవసర సేవలు కూడా బంద్ కావడంతో రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని అన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా 2700 కోట్లు బకాయి పెట్టిందన్నారు. యాక్సిడెంట్ కేసులు, గర్భిణీలు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేదలకు అందని దక్షగా మారుతుందని అన్నారు. ప్రైవేటీకరణ విధానాలను ఇప్పటికైనా మానుకోవాలని ప్రభుత్వాన్ని గనిశెట్టి హెచ్చరించారు.
ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలను మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని గని శెట్టి డిమాండ్ చేశారు. సమావేశంలో కర్రీ పోతి నాయుడు, పి చిన్నారావు, దూళి దేముడు, వై వెంకటరమణ, ఎస్.అప్పలరాజు, కొల్లు రాము తదితరులు పాల్గొన్నారు