– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్
పరవాడ: మండలంలో ఫార్మా పరిశ్రమల అతి సమీపంలో ఉండే కాలుష్యాన్ని అనుభవిస్తున్న తాడి గ్రామం వెంటనే తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
తాడి గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఫార్మా పరిశ్రమల నుండి విడుదల అవుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారని, గ్రామాన్ని తరలించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఎన్నికల్లో వాగ్దానం చేస్తున్న నాయకులు తర్వాత గ్రామాన్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
గ్రామాన్ని తరలించడానికి సర్వే నిర్వహించి తర్వాత గ్రామాన్ని తరలింపు చర్యలు ఊసే ఎత్తలేదని అన్నారు. మంచినీరికి మంచి గాలికి మంచి నేలకి ప్రజల మొఖమోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రజల జబ్బులతో మంచాలు పడుతున్నారని అన్నారు.
ప్రతిరోజు వాయువులతో ప్రజల జీవించలేకపోతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ గ్రామాన్ని తరలించడానికి విశేషమైన కృషి చేస్తానని వాగ్దానం చేశారని, మరి వాగ్దానం మాటే ఏమైందని ఆయన ప్రశ్నించారు. గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ, సిఐటియు నాయకురాలు సిఐటియు నాయకురాలు సేనాపతి వెంకటలక్ష్మి, టి రేవతి, జి అప్పారావు, జి అమ్మాజీ, పి సత్యవతి, నూకరత్నం, వరహాలమ్మ, భవాని, శివలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు