కళ్ళ ఎదుట నువ్వున్నప్పుడు,
నా మనస్సులో నీ రూపన్ని నిలుపుకోలేక పాయాను
తామరాకుపై మంచు బిందువులా
నీవు జారుకున్నప్పుడు నీ కొరకై వెతుకులాట ప్రారంభించేను
పౌర్ణమి నాటి వెన్నెలను నీ చిరునవ్వు అనుకున్నాను
ఎక్కడ ఉన్నావో అని తల ఎత్తి పైకి చూసినపుడు
మబ్బుల చాటుకి తప్పుకున్న చంద్రుణ్ణి చూసి
అది నువ్వే అనుకున్నాను..
నాలుగు దిక్కులకు పరిగెట్టి
గుండెలు పరిలేలా అరిచాను
నువ్వెక్కడ ఉన్నావు అని?
కాని నా ఆవేదన ఆరణ్యరోదనే అయ్యింది.
అందుకే ఏ చీకటి రాత్రిని అడిగినా చెబుతుంది,
నీ అభిమాను లేని నా మనస్సు తనవలె అంధకారమని
నిన్ను నీ అభిమామానపు వెన్నెలను కురిపించమని