Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ చిహ్నంతో నకిలీ పోస్టులు పెడితే చర్యలు తప్పవు

-చదువు “కొన్న” లోకేష్ టెన్త్ ఉత్తీర్ణతపై మాట్లాడటం హాస్యాస్పదం
-ఆందోళన కల్గిస్తున్న ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5 నివేదిక
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రభుత్వ చిహ్నంతో సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు పెడితే సన్మానాలు చేయరని, చర్యలే తీసుకుంటారని రాజ్యసభ సభ్యలు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రీష్మ, శిరీష, అనిత, పట్టాభి, అయ్యన్నపాత్రుడు వంటి తెదేపా నేతలే కాక ఇంకా ఎవరైనా అందరికీ ఒకటే చట్టమని, చట్టానికి కుటుంబ నేపధ్యం, లింగబేధం ఉండవని అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. పిచ్చివాగుడు వాగితే చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

10వ తరగతి ఉత్తీర్ణత శాతంపై తెదేపా నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన  ఘాటుగా స్పందించారు. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణమని పప్పు నాయుడు (లోకేష్) తెలుసుకోవాలని అన్నారు. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసిక ఆందోళనకు గురి చేసిన పాపం మీదే (తేదేపా)నని, దిగజారి ఆరోపణలు చేయడంలో లోకేష్ ఎల్లప్పుడూ ముందుంటాడని మండిపడ్డారు. చదువు “కొన్న” వాడివి, నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటని లోకేష్ పై మండిపడ్డారు.

కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలైతే చర్యలు తీసుకుంటామని బెదిరించి, కిందిస్థాయి నుంచి పై వరకు పాస్ పర్సెంటేజిని పెంచడానికి ఏం చేశారో మర్చిపోయారా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.  చంద్రబాబు అండదండలున్న కార్పొరేట్ సంస్థల్లో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లయ్యారని, ఇప్పుడా ర్యాంకులు తగ్గాయని బాబు ఏడుస్తున్నాడని ఏద్దేవా చేశారు.

ఇంగ్లీష్ మీడియంలో చదివితే పిల్లలు మొద్దబ్బాయిలు అవుతారని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారని, 2022 సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో తెలుగు మీడియంలో 43.97%, ఇంగ్లీష్ మీడియంలో 77.55% ఉత్తీర్ణత సాధించిన విషయం చంద్రబాబు, పచ్చ బ్యాచ్ తెలుసుకోవాలని అన్నారు.

6 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వారిలో 21.4%  మంది బాలికలు, 35.7% మంది బాలురు చదువుల పై అనాశక్తి చూపిస్తున్నారని, స్కూల్ డ్రాపౌట్లకు ఇదే ప్రధాన కారణమని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 రిపోర్టులో వెల్లడించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.  పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి పెంపొందించేందుకు సరైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుల్లో చురుకుగా పాల్గొనేందుకు మరియు వారిని చుదువులు కొనసాగించే దిశగా ప్రేరేపించి, ప్రోత్సహించే విధంగా వినూత్న రీతిలో టీచింగ్ పద్దతులు, వ్యూహాలు పొందుపరచి సరికొత్త పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

LEAVE A RESPONSE