Suryaa.co.in

Andhra Pradesh

అపరిమితంగా “జగనన్నవిదేశీ దీవెన” పథకం అమలుకు చర్యలు

•క్యూఎస్ ర్యాకింగ్ పొందిన టాప్ 100 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారికి పూర్తి ఫీజు రిఇంబర్స్ మెంట్
•ఎస్.సి.,ఎస్.టి.,బి.సి., మైనారిటీలతో పాటు అగ్రవర్గాల నిరుపేద విద్యార్థులకు వర్తింపు
•వార్షిక ఆధాయ పరిమితి రూ.6.00 లక్షల నుండి రూ.8.00 లక్షలకు పెంపు
•గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణలో బహిర్గతం
•2016-17 నుండి ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

అమరావతి, జూలై 14: రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేవిదంగా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “జగనన్న విదేశీ దీవెన” పథకాన్ని నూతన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.

గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్యూఎస్ ర్యాకింగ్ పొందిన 200 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిధ్యాలయాల్లో సీట్లు సాదించిన నిరుపేద విద్యార్థులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. అయితే టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాదించిన వారికి పూర్తి ఫీజు రీఇంబర్స్ మెంట్ చేయడం జరుగుతుదని, 100 పైబడి 200 ర్యాకింగ్ లో ఉన్న విద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకూ ఫీజు రీఇంబర్స్ మెంట్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

అపరిమితంగా సంతృప్తికర స్థాయిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా మార్గదర్శకాలను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలతో పాటు అగ్రవర్గాల నిరుపేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఈ పథకం అమలుకు ఆధాయ పరిమితి రూ.6.00 లక్షలుగా ఉండేదని, ఆపరిమితిని తమ ప్రభుత్వం రూ.8.00 లక్షలకు పెంపుచేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణలో బహిర్గతం
గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలు ఉన్నట్లు విజిలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్ విచారణలో గుర్తించడం జరిగిందని మంత్రి తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో ఆదాయ పరిమితిని పాటించకపోవడం, ఒక కుటుంభంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపు అనే నిబంధనను ఉల్లంగించడం, అధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే కొందరు విద్యార్థులు చదువుతున్న విశ్వవిద్యాలయాలను, వెళ్లాల్సిన దేశాలను కూడా మార్చుకున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద కొందరు విద్యార్థులు డబ్బులు పొంది కోర్సు పూర్తి చేయకుండానే రాష్ట్రానికి తిరిగి వచ్చేయడం జరిగిందన్నారు. 2016-17 నుండి ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE