మిర్చి పంటకు నష్టం చేసే తెగుళ్లపై కార్యాచరణ …జీవీఎల్ ఆరా

గుంటూరు స్పైసెస్ బోర్డు నందు రాజ్యసభ సభ్యులు,జాతీయ మిర్చి బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహ రావు అధ్యక్షతన జాతీయ మిర్చి ,స్పైసెస్ బోర్డు కొచ్చిన్ డైరెక్టర్ రేమశ్రీ మరియు సీనియర్ సైంటిస్ట్ పద్మజ తో ఇటీవల మిర్చి పంటకు అపార నష్టం కలుగ చేసిన తామర తెగులుపై శాస్త్రీయ అధ్యయనం ద్వారా నివారణ కనుగొనడానికి, భవిష్యత్తులో ఇటువంటి తెగుళ్ల నివారణ కై అనుసరించవలసిన విధానాలను గూర్చి చర్చించి కార్యాచరణ రూపొందించటం జరిగింది.

సుమారు 25 మందికి పై గా వివిధ జాతీయ తెగుళ్ల నివారణ అధ్యయన సంస్థల నుండి వచ్చిన శాస్తవేత్తలతో,పంట తెగుళ్ల నివారణలోవారి గత అనుభవాల ద్వారా ప్రస్తుతము ఉన్న కొద్దిపాటి పంటను కాపాడటంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి తెగుళ్లను పూర్తిగా నివారించేలా ప్రయత్నం చేయాలని ఈ
mirchi సమావేశంలో నిర్ణయించడం జరిగింది.ఈ అధ్యయన బృందం రెండు రోజులపాటు గుంటూరు ప్రకాశం జిల్లాలోని వివిధ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి తామర తెగులు పై సమగ్ర అధ్యయనం చేసి తన నివేదికని మిర్చి టాస్క్ ఫోర్స్ కు అందచేయనుంది.వీరిలో కొంతమంది శాస్త్రవేత్తలు టాస్క్ ఫోర్స్ ఆదేశాల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం లో కూడా పర్యటించనున్నారు.

Leave a Reply