– బీజేపీ కార్యాలయానికి నిప్పు
– రైళ్ళకు నిప్పు
– గాలిలో కాల్పులు
అగ్నిపథ్ స్కీమ్ ఉత్తరాది యువతలో అగ్గిరాజేసింది. సైన్యంలో చేరేందుకు కొన్నేళ్ళ నుంచి సిద్ధమౌతున్న యువకుల ఆశలను వమ్మూ చేస్తూ ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాలల్లో చేరిన అభ్యర్థుల్లో 75 శాతం మందిని నాలుగేళ్ళ తరవాత తిరిగి ఇంటికి పంపేలా అగ్నిపథ్ స్కీమ్ రూపొందించారు. గత కొన్నేళ్ళ నుంచి ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్‌మెంట్ ను జరుపలేదు. దీంతో అగ్నిపథ్ స్కీమ్‌పై యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రం రణరంగం మారింది. నిన్న ప్రారంభమైన ఈ నిరసన నేడు హింసాత్మకంగా మారింది. పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. కొన్ని చోట్ల రైళ్ళకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. నవాడాలో బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టగా, ఆఫీసులోని ప్రధాన విభాగాలు కాలిపోయాయి.