గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు

– ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి వెల్లడించారు. . రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు లేదా రేపు వెలువడతాయి.

ఆర్థిక శాఖ వారు ఉద్యోగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ, గౌరవ ముఖ్యమంత్రి గారు దానిని పక్కనపెట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల వల్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు పొందుతారు.
గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply