ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధావ్యుడు

-తెలంగాణా వచ్చాకే పండుగగా వ్యవసాయం
-మూడు లక్షల ఎకరాల సాగు నుండి 6 లక్షల 18 వేల ఎకరాలకు పెరుగుదల
-2014 కు ముందు 2 లక్షల 5 వేల 463 ఎకరాలకు నీళ్లు
-తెలంగాణా ఏర్పడ్డాకా 5 లక్షల 82 వేల 464 ఎకరాలకు గోదావరి జలాలు
-2014 కు పూర్వం 4 లక్షల 43 వేల 876 మెట్రిక్ టన్నులదిగుబడి
-కేసిఆర్ పాలనలో నుండి 12 లక్షల 27 వేల 145 మెట్రిక్ టన్నులకు పెరిగిన దిగుబడి
-రైతుబందు పధకం ద్వారా పెట్టుబడి సాయం 2723 కోట్ల 92 లక్షల పంపిణీ
-రైతుబబీమా పధకం కింద 3314 మంది రైతులకు 165 కోట్ల 75 లక్షల అందజేత
-విద్యుత్ విజయాలు యావత్ భారతదేశంలోనే సంచలనాలు
-వ్యవసాయ రంగంలో అప్రతిహత విజయాలు తెలంగాణాకే సొంతం
-ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే
-మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాందావ్యుడని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రైతు బాందావ్యుడై నందునే వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా సాలినా ఎకరాకు 10 వేల రూపాయలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలను సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఏండ్లపల్లి గ్రామంలో మూసి ఆయాకట్టు రైతాంగం భారీ ఎత్తున రైతు దినోత్సవం జరుపుకున్నారు.జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఎండ్ల పల్లి,సోలిపేట,రామాపురం, రామచంద్రాపురం,హనుమాన్ నాయక్ తండా నుండి భారీ ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడ్లబండ్ల ప్రదర్శన,ట్రాక్టర్ల ప్రదర్శన తో పాటు కోలాటం భజన బృందాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఎడ్లబండి తొలుకుంటు రైతుదినోత్సవంలో పాల్గొనడడం ఈ కార్యక్రమంలో ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం జరిగిన రైతు దినోత్సవ సభలోమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకే దండగ అనుకున్న వ్యవసాయం పండుగగా మారిందన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే దోహద పడ్డాయని ఆయన కొనియాడారు. మూడు లక్షల ఎకరాల సాగు నుండి 6 లక్షల 18 వేల ఎకరాలకు సాగు పెరిగింది అంటే అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమనేనన్నారు.2014 కు పూర్వం కేవలం 2 లక్షల 5 వేల 463 ఎకరాలకు మాత్రమే సాగు నీరు పారిందన్నారు.తెలంగాణా ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో 5 లక్షల 82 వేల 464 ఎకరాలకు గోదవరి జలాలు పారుతున్నాయన్నారు.ధాన్యం దిగుబడి లోను 2014 కు పూర్వంతో పోలిస్తే మూడింతలు పెరిగిందని ఆయన చెప్పారు.2014 కు పూర్వం 4 లక్షల 43 వేల 876 మెట్రిక్ టన్నుల దిగుబడిగా నమోదు చేసుకోగా 2014 తరువాత అదే దిగుబడి 12 లక్షల 27 వేల 145 మెట్రిక్ టన్నులకు పెరగడమే కోరి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్ల ప్రగతి అని ఆయన తెలిపారు.

చరిత్రలోనే ముందెన్నడూ లేని పద్దతిలో వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కితాబిచ్చారు. సాలినా ఎకరాకు 10 వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నవిషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదీ కుడా దళారులు లేకుండా నేరుగా రైతు అకౌంట్ లో జమ చేసే విధానాన్ని మొట్ట మొదటిసారిగా ప్రవేశ పెట్టిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే సొంతంగా మారిందన్నారు.ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో రైతుబంధు పధకంలో భాగంగా 2723 కోట్ల 92 లక్షల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతాంగం ఖాతాలో జమ చేసినట్లు ఆయన తెలిపారు.దానికి తోడు ప్రమాద వశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు గాను రైతుబీమా పధకాన్ని ప్రారంభించిన చరిత్ర కుడా ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.సహజ మరణాలకు కుడా భీమా వర్తిస్తుందని నిరూపింఛడమే కాకుండా ఆచరణలో అమలు చేసి నిరూపించిన చరిత్ర కూడ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.

ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో రైతు భీమా పధకంలో బాగంగా 3314 లబ్దిదారులకు 165 కోట్ల 75 లక్షల రూపాయలను అంద జేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు యావత్ భారత దేశంలో పెను దుమారం సృష్టిస్తూ న్నాయన్నారు. ఉండనే ఉండదు అనుకున్న కరెంట్ పోనే పోదు అన్న కాడికి తీసుకొచ్చిన దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అటువంటి నేత మార్గంలో ఉద్యమించడంతో రాష్ట్రాన్ని సాదించుకున్నామని..అదే నేత చేతిలో అధికారం పెట్టడంతో తొమ్మిదేళ్ల వ్యవధిలోనే వందేళ్ల అభివృద్ధి తో పోటీ పడ్డామన్నారు.ఆ అద్భుత ఫలాలు అందుకున్న తెలంగాణా సమాజం మరింతగా పురోగమించాలి అనుకుంటే 2014 కు ముందు వెనుక పరిస్థితులను ఆత్మవలోకనం చేసుకోవాలన్నారు.యింకా ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి జీడీ బిక్షం, యం పి పి రవీందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply