-అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి, బుగ్గన మాట్లాడిన మాటలు వింటే, రాష్ట్రాన్ని మరింత నాశనంచేయడానికి సిద్ధమవుతున్నారా అనిపించింది
-ఆలపాటి రాజేంద్రప్రసాద్
నేటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి బుగ్గనప్రసంగాలు గమనిస్తే, రాష్ట్రాన్ని మరలా నాశనంచేస్తున్నా మనే సంకేతాలు స్పష్టమయ్యాయి. మీరు తీసుకున్న విచ్చిన్నకర నిర్ణయాలపై న్యాయపరం గా వాదనలు జరిగే సమయంలో, మీ నిర్ణయాలు అశాస్త్రీయంగా ఉన్నాయని, చట్టవిరుద్ధంగా ఉన్నాయని భావించే వెనక్కుతగ్గారు. అలానే సీఆర్డీఏ యాక్ట్ ని రివైవ్ చేస్తూ మాట్లాడారు.
అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు అవసరం అవుతాయన్న పాలకులమాటలు అపహాస్యంగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి, ఆర్థికశాఖామంత్రి అనాల్సినమాటలు కావు. అమరావతి ప్రజా రాజధాని, స్వయంప్రతిపత్తితో కూడింది. దానికి ఎవరూ పైసాకూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎవరియొక్క దయాధర్మాలపై ఆధారపడే పరిస్థితిదానికి లేదు. ఎవరూ పైసా ఖర్చు పెట్టాల్సినపనిలేని రాజధానిమీకు అప్పగిస్తే, పూర్తిగా నాశనంచేశారు. ఈ రెండున్నరేళ్లలో ఎక్కడైనా ఒక్కఅభివృద్ధిచేశారా? ఏ జిల్లాలో అయినా ఒక్కపరిశ్రమ నెలకొల్పారా? గతప్రభు త్వంలో అన్నిజిల్లాల్లో అభివృద్ధిచేయాలన్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపించాయి. దానికి తగినట్టే పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం వికేంద్రీకరణను మాటలకు పరిమితం చేసి, ఇసుకమద్యాన్ని కేంద్రీకరణ చేసి, దోచుకుంటోంది. ఎక్కడా ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, చివరకు చేసిన చట్టాలు న్యాయస్థానాల్లో అభాసుపాలవుతున్నా యని గమనించి తోకముడిచారు. జీ.ఎన్.రావు కమిటీతో మాట్లాడామనిచెబుతున్నారు… ఎవరు ఏం మాట్లాడారో తెలియదు.
మీరు కోర్టులను పక్కదారిపట్టించి, ప్రజల్లో కుల, మత, ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టేలా చేస్తున్నప్రయత్నాలు బట్టబయలయ్యాయి. రాజధానిలో 30శాతం ఎస్సీలుంటే, కేవలం ఆప్రాంతం ఒకవర్గానిదే అని ప్రచారంచేశారు. చట్టసభలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. శాసనమండలిని రద్దుచేస్తున్నామన్నారు..నేడు అదే సభకు తిరిగి సభ్యులను నామినేట్ చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా మూడురాజధానుల చట్టాలను రద్దుచేయడం మంచిదే అయినా, మరోపక్క ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తు న్నారు. మీ ప్రకటనలను ఎప్పటికీ ప్రజలు విశ్వసించరు. ఇది ఇంటర్వెల్ మాత్రమే అంటు న్నారు…క్లైమాక్స్ లో నష్టపోయేది మీరే.
మహిళలను అవమానించేలా, సభ్యసమాజం సిగ్గపడేలా మీరు అసెంబ్లీలో ప్రవర్తించారు. మీరు మాట్లాడిన మాటలు వాటి తాలూకా మరకలుఎన్నటికీ చెరిగిపోవు, మీరు శాశ్వతంగా రాష్ట్రంవదిలిపోతేనే ఆమరకలు పోతాయి. ఏదోఒకతప్పుచేయడం, దాన్ని కప్పిపుచ్చుకోవ డానికి మరోఅంశాన్ని తెరపైకి తీసుకురావడం ఈప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది.