నష్ట పోయిన ప్రతి రైతును తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

-మాజీ మంత్రి నక్కా.ఆనంద్ బాబు
కొల్లూరు:వేమూరు నియోజకవర్గం,కొల్లూరు లో భారీ వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను పరిశీలించి,రైతులతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు.గతంలో సంవత్సరం ఎలా పంటలు నష్టపోయాయో ఈ సంవత్సరం కూడా అదే విధంగా పంటలు నష్టం వాటిల్లింది.పంటల నష్టం వల్ల రైతుల నడ్డి విరిగి తీవ్ర ఆందోళనలో ఉంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సరదాలు షికార్లు కొడుతున్నారు.వరదలు వల్ల ప్రజలు అల్లడిపోతుంటే వీళ్ళ చేతకాని తనాన్ని పక్క దారి పట్టించటానికి ప్రతిపక్షాలు మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు.వరదల్లో 4జిల్లాల ప్రజలు అల్లడిపోతుంటే ప్రజలను గాలికి వదిలేసి జగన్ మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కులుకుతున్నారు.
ప్రజలు అల్లడిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులు పట్టిచుకోరు ఆశలు రాష్ట్రంలో పాలన ఉందా లేదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.సమస్యలు అన్ని ప్రక్క దారి పట్టించడం ప్రజలను నట్టేట ముంచటమే జగన్ ప్రభుత్వం పని తీరు.వేలాది ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లిది వేళా కోట్లు రూపాయలు రైతాంగం నష్టపోయింది ఇంత వరకు ప్రభుత్వం గాని అధికారులు గాని రైతాంగాన్ని పలకరించిన దిక్కు లేదు.అధికారులు పొలాలు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతులు నష్టపోయిన ప్రతి గింజకు నష్ట పరిహారం చెల్లించాలి.రైతులను ప్రభుత్వం అదుకోకపోతే రైతాంగం తరుపున రోడ్లుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వం మొద్దు నిద్ర మాని వెంటనే నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి.కిషోర్, కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధు, మాజీ కృష్ణా డెల్టా చైర్మన్ మైనేని మురళీ, తెలుగు యువత కార్యదర్శి నాగ శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.