Suryaa.co.in

Andhra Pradesh

నుంచి అలిపిరి మార్గం ప్రారంభం

నేటి (అక్టోబర్ 1 )నుంచి అలిపిరి మార్గం ప్రారంభం .. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు . నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి . ఒకటి అలిపిరి మెట్లు మార్గం … మరొకటి శ్రీవారి మెట్టు మార్గం … అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు . అయితే మరమ్మతులు , ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు మూసివేశారు .
దీంతో ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు . ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతించినట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) . ఈ నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది . బ్రహ్మోత్సవాలు నుంచి శ్రీవారి క్యాలెండర్లు , డైరీలను అమ్మనున్నట్లు టీటీడీ చెప్పింది . ఈ నెల 19 న అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని పుష్కరిణిలో ఏకాంతం చక్రస్నానాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది .

LEAVE A RESPONSE