Suryaa.co.in

Telangana

హాస్టళ్లలో మరణమృదంగాలా? హవ్వ!

– రేవంత్ .. ఎవరిదీ పాపం?
– చిన్నారుల మరణాలన్నీ సర్కారీ హత్యలే
– స్వంత జిల్లా మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్.
– ఆస్పత్రికి 30 మంది విద్యార్థులను తరలింపు
– ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల మరణం
– రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పాలన హాస్టల్ పిల్లలకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. హాస్టళ్లలో మరణమృదంగాలు వినిపిస్తుంటే సీఎం రేవంత్ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని, ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం, పూర్తిస్థాయి ప్రత్యేక కార్యదర్శిని నియమించకపోవడం హాస్టల్ పిల్లలకు శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలనలో ఇప్పటివరకూ 48 మంది హాస్టల్ పిల్లలు తలలు వాల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారుల మరణాలన్నీ సర్కారీ హత్యలేనని స్పష్టం చేశారు.

దాసోజు శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి ఉరఫ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అసమర్ధత కారణంగా తన స్వంత జిల్లాలో తాజాగా మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్.

మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులకు వాంతులు… తల, కడుపు నొప్పితో విలవిలలాడిన విద్యార్థులు. మక్తల్ ఆస్పత్రికి 30 మంది విద్యార్థులను తరలింపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల మరణం. తల్లితండ్రులకు కడుపుకోత.. ఎవరిదీ పాపం? ప్రత్యేక విద్యాశాఖ మంత్రి, పూర్తి బాధ్యతలతో ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించకుండా రేవంత్ రెడ్డి నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నాడు.

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీ..కనీస రివ్యూ లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ లో బిజీ. మొత్తం మీద బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో తమ నిర్లక్ష్యంతో, అసమర్ధతతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరనేరానికి పాల్పడుతున్నారు..వీరిద్దరూ ప్రజాకోర్టులో శిక్షార్హులు!

LEAVE A RESPONSE