Suryaa.co.in

Andhra Pradesh

సమాజ హితమే జర్నలిస్టుల ప్రధాన లక్ష్యం కావాలి

– మీడియా సోదరుల సంక్షేమం కోసం కృషిచేస్తా
-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి

ఇబ్రహీంపట్నం: సమాజ హితమే జర్నలిస్టుల ప్రధాన లక్ష్యం కావాలని, మీడియా సోదరుల సంక్షేమం కోసం కృషి చేస్తానని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీఎంపిఏ) మైలవరం నియోజకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పాత్రికేయుల సేవలు ఎనలేనివన్నారు. జర్నలిస్టులు మీడియా రంగం విలువలను రక్షించాలన్నారు. గౌరవాన్ని మరింత పెంచాలన్నారు. పత్రికా రంగం కాలక్రమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాగా రూపాంతరం చెందిందన్నారు.

LEAVE A RESPONSE