Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ తననేరాలు, తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే

– ఢిల్లీలో దిగగానే జగన్ చేసే మొదటిపని కేంద్రపెద్దలకు సాష్టాంగపడటం
– సతీసమేతంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించని జగన్, ఆశీర్వాదంకోసం స్వామీజీతో గంటలపాటు మంతనాలు జరిపాడంటే ఎవరు నమ్ముతారు?
• వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ ఒకడుగు ముందుకేస్తే, జగన్ ఢిల్లీలో ప్రత్యక్షమవుతున్నాడు
• తమ్ముడిని కాపాడుకోవడానికి సొంతచెల్లికి అన్యాయంచేస్తున్న జగన్, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను రక్షిస్తాడా?
• రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలకోసమే ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్తున్నారని ఎన్నాళ్లు కట్టుకథలు చెబుతారు?
• మంత్రి కొట్టుసత్యనారాయణ సీఎం సుఖం, క్షేమంకోసం యాగంచేయకుండా, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయేందుకు చేస్తే ప్రజలు సంతోషిస్తారు
– ఢిల్లీవెళ్తే, అక్కడికి వెళ్లాక ఎవరితో ఏంమాట్లాడింది వెంటనే మీడియా వారితో చెప్పాలి
– తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

తాడేపల్లి ప్యాలెస్ లో వస్తున్న ప్రకంపనలధాటికి, వైసీపీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వణికిపోతున్నార ని, వాటివల్లే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీపర్యటనలు ఖరారవుతున్నా యని, ఆయనకు కూడా ఉన్నట్టుండే రాష్ట్ర ప్రయోజ నాలు గుర్తుకువస్తున్నాయని, గతంలో దాదాపు 24సార్లు ఢిల్లీవెళ్లిన జగన్, ఏనాడూ అక్కడిమంత్రులతో ఏం మాట్లాడింది, రాష్ట్రానికి ఏం సాధించబోతోంది ఎప్పుడూ మీడియాకు చెప్పిందిలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు , తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే…

చేసిన నేరాలు, తప్పులు కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటనలు.. పైకేమో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమని కలరింగ్ ఇస్తున్నారు
“జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీవెళ్లినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వేజోన్, ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి వాటి గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. గల్లీస్థాయిలో చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నాడు. పైకిమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసమని కలరింగ్ ఇస్తున్నారు. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు నుంచి అవినాశ్ రెడ్డిని కాపాడటానికే ముఖ్యమంత్రి రేపు ఢిల్లీవెళ్తున్నారు. తన మనుషుల్ని కాపాడుకోవడానికి ఆఖరికి జగన్, తనకుమార్తెలను కలవడానికి ఖరారుచేసుకున్న లండన్ పర్యటనను కూడా రద్దుచేసుకున్నాడు.

జగన్ ఢిల్లీవెళ్లేది కేంద్రమంత్రులు, అక్కడిపెద్దలకు సాష్టాంగపడటానికే. సొంతచెల్లికి అన్యాయంచేసి, తప్పుచేసిన తమ్ముడిని కాపాడటానికి ప్రయత్నిస్తున్న జగన్, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కాపాడతాడా?
ఢిల్లీవెళ్లగానే జగన్ చేసే మొదటిపని అక్కడిపెద్దలకు సాష్టాంగపడటం. సాష్టాంగపడి తమ్ము డిని కాపాడి, చెల్లికి అన్యాయంచేయాలని చూస్తున్నాడు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కా పాడతాను అని ప్రగల్భాలు పలికే జగన్, తనతమ్ముడు అవినాశ్ రెడ్డికోసం బాబాయ్ కూతు రు వై.ఎస్.సునీతను ఎందుకు బలిచేస్తున్నాడు. జగన్ చేస్తున్న పాపాలకు ఆఖరికి ఐ.ఏ.ఎస్ అధికారులు కూడా బలవుతున్నారు. ఖజానాలో డబ్బులేనందునే వసతిదీవెన కార్యక్రమా న్ని వాయిదావేసుకున్నామని సీ.ఎస్.జవహర్ రెడ్డి చెప్పడం, ఈప్రభుత్వ దౌర్భాగ్యపు పనితీరుకి నిదర్శనం. రేపు బటన్ నొక్కుతుంటే, ఈరోజు ఖజానాలో డబ్బుఉందో లేదో చెక్ చేసుకో వాల్సిన దుస్థితిలో ఈప్రభుత్వం ఉంది. వసతిదీవెన అమలుచేయడానికే డబ్బులేకపోతే, చాంతాడంత హామీలు ఎప్పుడు అమలుచేస్తారు? నవరత్నాలు ఎప్పుడు అమలుచేస్తారు? జగన్ నిజంగా రాష్ట్రప్రయోజనాలకోసం ప్రజలకోసం ఢిల్లీవెళ్తే, అక్కడ మంత్రులు, ఇతరపెద్ద ల్నికలిసిన వెంటనే మీడియాముందుకొచ్చి తాను ఎవరితో ఏంమాట్లాడింది… వారేంచెప్పింది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ముఖ్యమంత్రి అసమర్థత ప్రజలకు తెలియదన్నట్లు జవహ ర్ రెడ్డి ఎందుకు కాకమ్మకబుర్లు చెబుతాడు?

వివేకాను గొడ్డలితో చంపింది మొదలు.. కేసు విచారణను అడ్డుకునేవరకు కీలకపాత్ర పోషించినవారంతా వై.ఎస్.రెడ్లే. కర్కశంగా చంపినవారే, ఆనేరాన్ని చంద్రబాబుపైకి, టీడీపీపైకి నెట్టాలని ప్రయత్నించారు
తండ్రి తర్వాత తండ్రైన సొంతబాబాయ్ ని గొడ్డలితో అతికిరాతకంగా చంపినవారు సిగ్గులేకుం డా ఇంకా ఒకకన్నుని ఇంకోకన్ను పొడుస్తుందా అని కట్టుకథలు చెప్పారు. సాక్షిపత్రికలో నారాసుర రక్తచరిత్ర అని విషప్రచారం చేశారు. ఎవరు వివేకాను చంపారు…ఎందుకు చంపారు .. ఏ రాష్ట్రప్రయోజనాలకోసం చంపారని అందరికీ అర్థమైంది. తాను ముఖ్యమంత్రి కావడానికి, అవినాశ్ రెడ్డిని ఎంపీని చేయడానికే జగన్ వివేకాను హత్యచేయించారు. ఈ వ్యవహారంలో చంపింది వై.ఎస్.రెడ్డి.. చనిపోయింది వై.ఎస్.రెడ్డే…గుండెపోటు అనిచెప్పంది వై.ఎస్.రెడ్డే.. శవానికి రక్తపుమరకలు తుడిచేసింది వై.ఎస్..రెడ్డే…సీబీఐ విచారణ కావాలని కోరింది వై.ఎస్. రెడ్డే..తరువాత ఆంధ్రాలో తనకున్యాయం జరగదని చెప్పింది వై.ఎస్.రెడ్డే… మరలా కేసు పెట్టింది వై.ఎస్.రెడ్డే. ఇందరు వై.ఎస్.రెడ్లు కలిసి కర్కశంగా వివేకానుచంపేసి, ఆ నేరా న్ని చంద్రబాబుపైకి, టీడీపీపైకి నెట్టింది కూడా వై.ఎస్.రెడ్లే.

ఇంతదారుణంచేసిన వారు ఎప్ప టికైనా శిక్షింపబడక తప్పదు. ఎప్పటికైనాన్యాయమే గెలుస్తుంది అనడానికి వివేకాహత్యకేసు లోజరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ఇన్నిచేసినా ఎక్కడా వెరవకుండా పోరాడిన వివే కా కుమార్తె డాక్టర్ సునీతకు నిజంగా మహిళలందరి తరపున చేతులెత్తి దండంపెడుతున్నా ను. వీళ్లుచేసిన వెధవపనుల నుంచి బయటపడానికి ప్రత్యేకవిమానంలో మరో ప్రత్యేక విమా నంలో మైసూర్ నుంచి విజయ్ కుమార్ అనే స్వామీజీని రప్పించి, రంగంలోకి దించారు. విజయ్ కుమార్ స్వామీజీకి అంతపవర్ ఉంటే, ఆయన ముఖ్యమంత్రి తనకుర్చీ నుంచి దిగిపోవాలని ఆశీర్వదిస్తే, ప్రజలకు మేలుచేసినవాడు అయ్యేవాడు. కొట్టు సత్యనారాయణ సీఎం సుఖంకోసం, ఆయన మంచికోసం యాగంచేయకుండా, రాష్ట్రానికిపట్టిన పీడ వదిలిపోయేందుకు యాగంచేయాలి. విజయ్ కుమార్ స్వామీజీ జగన్ కు ఆశీర్వచనం ఇవ్వడానికే వచ్చాడని వై.వీ.సుబ్బారెడ్డి చెప్పడం సిగ్గుచేటు. రాములవారి విగ్రహం తలతెగినప్పుడు జగన్ అతని భార్య, మాటమాత్రం జరిగింది తప్పు అని స్పందించలేదు. శ్రీ రామనవమికి రాములవారికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి ఆ దంపతులకు తీరికలేదు. తిరుమల వేంకటేశ్వరునికి బ్రహ్మోత్స వాల సమయంలో పట్టువస్త్రాలు ఇవ్వడానికి జగన్ కు ఆయన భార్యకు కుదరదు.

అలాంటి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి ఒక స్వామీజీ రావడం … ఆయనతో గంటలకొద్దీ వారు ఆశీర్వచనం తీసుకోవడం ఎంతవింత కథో కదా! జగ న్ ను ఆశీర్వదించిన స్వామీజీకి నిజంగా అంత పవర్ ఉంటే, ఆయన ప్రజల బాగుకోసం జగన్ తనకుర్చీ వదిలేసేలా ఆశీర్వదిస్తే బాగుం టుంది. ఎక్కడైనా ఎవరైనా ఆశీర్వాదం కావాలంటే స్వామీజీలు, దేవుళ్లవద్దకు వాళ్లు వెళతా రు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా.. అందుకే ఆయన్ని ఆశీర్వదించడానికి స్వామీజీనే నేరుగా ప్రత్యేకవిమానంలో ఆయనింటికి వచ్చాడు. బాబాయ్ హత్యకేసులో నిన్నవై.ఎస్.భాస్కర్ రెడ్డి అరెస్ట్ …నేడో రేపో అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. తరువాత జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య కూడా అరెస్ట్ కావచ్చు. సీఎంగారు సుఖంగా ఉండటానికి, ఆయనకు ఏమీజరగకుండా ఉండటానికి యాగంచేస్తున్నట్టు, దానికోసం అయ్యేఖర్చుని టీటీడీ భరిస్తుందని మంత్రి కొట్టుసత్యనారాయణచెప్పడం సిగ్గుచేటు. ఆయన యాగాలు చేయాల్సింది జగన్ మంచికోసం కాదు. రాష్ట్రానికి పట్టినశని, పీడ వదిలిపోవాలని యాగంచేస్తే ప్రజలు సంతోషిస్తారు.

వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ ఒక్కడుగు ముందుకేస్తే, జగన్ ఆఘమేఘాలమీద ఢిల్లీ కి పరిగెత్తుతున్నాడు. అంతభయపడే వ్యక్తిని ప్రజలు నమ్మాలా… అతని స్టిక్కర్లను ఇంటి గోడలపై అతికించుకోవాలా?
వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ ఒక్కడుగు ముందుకువేస్తే, జగన్ ఆఘమేఘాలమీద ఢి ల్లీకి పరుగులు పెడుతున్నాడు. అంతభయపడే వ్యక్తిని ప్రజలు నమ్మాలా.. ఆయన ప్రజల నమ్మకం… వారి భవిష్యత్తా? జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లను ప్రజల ఇళ్లగోడలపై అంటించ కుండా ఆయన చెల్లి ఇల్లు, తల్లిఇంటి గోడలపై అంటించగలరా? ప్రపంచవ్యాప్తంగా విత్ అవుట్ నామినేషన్ ఆస్కార్ఇవ్వాలనుకుంటే అది కచ్చితంగా జగన్ కే వస్తుంది. కోడికత్తి డ్రా మా తో అమయాకుడైన దళితయువకుడు శ్రీనివాస్ ను జైలుపాలుచేశాడు. 4ఏళ్లుగా చేయ ని తప్పుకు శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతుంటే, గొడ్డలితో బాబాయ్ ని చంపినతమ్ముడు మాత్రం జై లుకు వెళ్లకూడదని జగన్ ప్రయత్నిస్తున్నాడు. అదీ ఆయనరాజనీతి.

సీఎం కుర్చీలో కూర్చో వడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నిఅడ్డదారులు తొక్కాడో చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజుకి కూడా తనను తాను మోసగించుకుంటూ ప్రజల్ని మోసగిస్తూ, తనబొమ్మలతో కూడిన స్టిక్కర్లను తనపార్టీవారికిచ్చి ఇంకా ప్రజల్ని మోసగించాలనే చూస్తున్నాడు. వై.ఎస్.సునీత పోరాటానికి మా మద్ధతు ఎప్పుడూఉంటుంది. జగన్ రాష్ట్రానికి నిధులు తేవడానికి, ప్రజలకు మంచి చే యడానికే నిజంగా ఢిల్లీవెళ్తే, అక్కడికి వెళ్లాక ఎవరితో ఏంమాట్లాడింది వెంటనే మీడియా వారితో చెప్పాలి. లేకపోతే జగన్ తనతమ్ముడిని రక్షించడానికే ఢిల్లీపెద్దల కాళ్లుపట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లాడని భావించకతప్పదు.” అని అనిత స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE