మంగళగిరి: చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం, అలుగుమానిపల్లి గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి బాలచంద్రయ్య పార్టీలో చాలా సీనియర్ నాయకులు. వివిధ హోదాలలో వీరు, వీరి కుటుంబ సభ్యులు పార్టీ కోసం పనిచేశారు. వారి కుమారుడు, కుమార్తె ఇద్దరూ వైద్యవిద్య చదివేందుకు విదేశాలకు వెళ్లారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న విదేశీ విద్యా పథకం వీరికి ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఆ పథకం నిలుపుదల చేయడంతో చదువు పూర్తి చేసేందుకు వీరికి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వారి కుటుంబానికి అండగా ఉండేందుకు, వారి వైద్య విద్య పూర్తయ్యేందుకు ఆర్థిక సహాయం మూడు లక్షలు (₹3,00,000) చేయాలని ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు నక్కా ఆనంద బాబు చేతుల మీదుగా తిమ్మయ్యగారి బాలచంద్రయ్య గారికి నగదు అందచేశారు.