చరిత్ర పుటల సాక్షిగా

మన్యం వాసుల కష్టాలను
కడతేర్చటానికి,
తెల్లదొరల దోపిడిని
ఎదుర్కోవడానికి
విల్లంబులతో విరుచుకుపడ్డ
గురి తప్పని విలుకాడు…!!

గిరిజనులకు ఆండగా నిలిచి
సాయుధపోరాటం సాగించి
తెల్లవాళ్లను పరుగులు తీయించి
ఒక మహోజ్వల శక్తి గా ఎదిగిన
మన్యం మహావీరుడు…!!

అత్యాచారాలను నిలదీసి
గిరిజనులలో చైతన్యం రగిలించి
విప్లవానికి వేదిక సిద్ధం చేసి
గడ్డు ఆంగ్లేయులను
గడగడలాడించిన
ఆరని విప్లవ జ్యోతి…!!

వాగు వంకలలో
వనవాసము చేసి ….
రెండేళ్లపాటు బ్రిటీషర్ల్ కు
కంటిమీద కునుకు లేకుండా చేసి ఎందరికో దైవంగా మారిన
మనసున్న మారాజు….!!

రవి అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్యానికి
మన్యంలో చుక్కలు చూపించి
ఠాణాలను కొల్లగొట్టి
తూటాలతో వేటాడి
తుది సమరం మొదలుపెట్టి
జాతీయోద్యమానికి
వారధిగా నిలిచిన
తెలుగుజాతి పౌరుషం…!!

మన్యం ప్రజల హక్కుల కోసం,
స్వాతంత్రం కోసం….
నిప్పు కణమై ప్రజ్వరిల్లి
వందేమాతరమని నినదించి
దేహత్యాగం చేసి
జాతి స్మృతిలో నిలిచిన
శౌర్య శిఖరం…!!

వీరుడు మరణింపడు
విప్లవానికి పరాజయం లేదు
వీరుల రక్తం చిరకాలం ప్రవహించిన
“చరిత్ర పుటల సాక్షిగా”……

అతడే ఒక సైన్యం
ఆయన జీవితం…
ఆయన గమ్యం…
అందుకు ఎంచుకున్న మార్గం
అన్నీ ప్రత్యేకం
మన అల్లూరి విప్లవాగ్నిని
అందుకుంటుంది ప్రతి తరం…..!!
( అగ్గి పిడుగు ……”అల్లూరి సీతారామరాజుగారి”125వ జయంతి సందర్భంగా……)

నలిగల రాధికా రత్న.

Leave a Reply