Suryaa.co.in

Andhra Pradesh

అమరావతినే ఏకైక రాజధాని

-మూడు రాజధానులపై మా వైఖరి ఇదే
-బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్

రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన స్టాండ్‌ ఏంటనేది మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెబుతోందని మరోసారి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఫైరయ్యారు. దేశంలో అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువ రోజులు జరిగిన రాష్ట్రం ఒక్క ఏపీయేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి లేజిస్లేటివ్ మీద నమ్మకం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ఇక, అసెంబ్లీ వేదికగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి లేక రాష్ట్రం నుంచి వలసలు వెళ్లిపోయే దుస్థితికి వచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE