Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి రైతుల మహాపాదయాత్ర.. ధర్మయాత్ర

-జగన్ ఈ యాత్ర కు అడ్డంకులు కలిగిస్తే మీకు శవ యాత్ర అవుతుంది
-అమరావతి ఉద్యమాన్ని అడ్డుకుంటే వైసిపి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే
-జగన్ కి దమ్ముంటే బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ తీసుకు రావాలి
-ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధి, ఉపాధి కోరుకుంటారు
-వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, విద్యుత్ చట్టం సవరణకు జగన్ మద్దతు ఇవ్వడం దుర్మార్గం
-పక్క రాష్ట్రాల్లో మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి
-జగన్ మాత్రం పేదల పై భారాలకు బార్లా తలుపులు తీశారు
-భయపెట్టి పాలన చేయాలనుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు
-విజయవాడ ఆంధ్రరత్నభన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

విజయవాడ : అమరావతి నుంచి అరసవెల్లి వరకు రైతులు చేస్తున్న పాదయాత్ర ధర్మయాత్ర. ఈ ధర్మయాత్రకు ఆటంకాలు కల్పించవద్దని, ఇబ్బందులు పెట్టవద్దని, అభ్యంతరాలు చెప్పవద్దని వైసీపీ ప్రభుత్వాన్ని, నాయకులును కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుందన్నారు. ఈ ధర్మయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే.. ఈపాదయాత్ర వైసీపీకి శవయాత్ర అవుతుందని తస్మాత్ జాగ్రత్త అని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకు వస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2022 సమాఖ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు ద్వారా మొత్తం విద్యుత్ రంగం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం ప్రభత్వం చేతుల్లోకి వెళ్లిపోతుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆదానీ, అంబానీ వంటి వారు చొరబడే అవకాశం కూడా ఉందన్నారు.

విద్యుత్ ఛార్జీల బిల్లు పట్టుకుంటేనే కరెంటు షాక్ తగిలే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి కి భవిష్యత్ లో ఎటువంటి అధికారాలు ఉండవని చెప్పారు. కేంద్రం ఉచిత విద్యుత్ సరఫరాకు వ్యతిరేకమని, అందుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుందన్నారు. తెలంగాణా, కర్నాటక, ఒరిస్సా ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. జగన్ సర్కార్ మాత్రం ఈ విద్యుత్ సవరణ బిల్లుకు పూర్తిగా మద్దతు ప్రకటించడం అన్యాయమన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే.. ఉఛిత విద్యుత్ అనేది పూర్తిగా కనుమరుగవుతుందన్నారు.

ఈ విద్యుత్ సవరణ బిల్లు అమలైతే రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించలేక వ్యవసాయాన్ని వదిలే ప్రమాదం ఉందని, లేదా ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ విద్యుత్ బిల్లును వైసీపీ పూర్తిగా వ్యతిరేకించాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఉపసంరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లు ద్వారా రైతుల మెడలకు ఉరి తాడు వేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తే.. రైతులే మీ ప్రభుత్వానికి, పార్టీకి ఉరితాడు వేస్తారని హెచ్చరించారు.

పోగాలం దాపురించిన వాడు .. వినడు కనడు అన్న విధంగా జగన్ కు, వైసీపీ ప్రభుత్వం తీరు ఉందన్నారు. వినాశకాలే విపరీత బుద్దులు అన్నట్లుగా అమరావతి పై కుట్ర చేయడం వారి ఆత్మహత్యా స్పృహద్యస్యమే అని అభివర్ణించారు. ఉత్తరాంద్ర ప్రజలు కూడా ఆర్ధిక రాజధానిగా, ఐటీ రాజధానిగా, చలనచిత్ర రాజధానిగా చేయాలని కోరుతున్నారని, అక్కడి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆశిస్తున్నారని పునరుద్ఘాటించారు.

రాష్ట్ర సచివాలం, అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసిన అమరావతి నుంచే పాలన సాగించి, ఇతర ప్రాంతాలను అభివృద్ది చేసే విషయాలపై జగన్ దృష్టి సారించాలని తులసిరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయని, దేశ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తులు ధరలు మాత్రం తగ్గించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 2014 లో బ్యారెల్ ధర 114 డాలర్లు ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్ 75లోపే అందించామని గుర్తు చేశారు.

డీజిల్ 50, గ్యాస్ సిలిండర్ 410 కి సరఫరా చేసి, ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు మోడీ హయాంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయయని, పెట్రోల్ 110, డీజిల్ 100, గ్యాస్ ఇప్పుడు 1150 రూపాయలు తీసుకుంటున్నారన్నారు. 114 డాలర్ల నుంచి 88 డాలర్లు తగ్గినా.. కేంద్రం ధరలు తగ్గించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ చమురు కంపెనీలను, మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

LEAVE A RESPONSE