Suryaa.co.in

Features

అగ్రకులాలకు అంబేద్కర్ వ్యతిరేకం కాదు

ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకోసం కన్నీరు, కార్చిండు, మానసిక వేదనకురై ఆహుతి అయిండు! కొడుకులు బిడ్డలను కోల్పోయాడు, ఆ మహనీయుని భిక్షతో రిజర్వేషన్లు అనుభవిస్తున్న దళిత వర్గాలు ఆ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము!

అవమానాలు, కుల వివక్షత, రాజకీయ అణిచివేత అవేమి కొత్తేమి కావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు.. భారతదేశంలో జీవం ఉండే ప్రతి ప్రాణి నుండి, నిర్జీవంగా మారే వరకు ప్రతి ప్రాణికి జీవకోటికి, భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్ధాంతరంగా, తన జీవితాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చింది?

అంబేద్కర్ గారి మరణానికి కారణం ఎవరు?
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ బిక్ష వల్ల ఎంపీలు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులు అవుతున్నవారు ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ను మరచిపోతున్నారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ మాత్రమే గుర్తుకు రావడం, ఎన్నికల అనంతరం మర్చిపోవడం పరిపాటిగా మారిందా!

అంబేద్కర్ గారి రిజర్వేషన్ భిక్ష వల్ల ఉద్యోగ అవకాశాలు పొందిన చాలామంది ప్రమోషన్ల కోసం, తమ కూతురు కొడుకు డాక్టరు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఇతర ఉన్నత ఉద్యోగాల కోసం మాత్రమే కులాన్ని వాడుకుంటున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కూడా వారికి తెలియకపోవడం బాధాకరం.

కనీసం ఘన నివాళి అర్పించేందుకు కూడా ఒక్క 15 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించకపోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆధిపత్య, అగ్రకులాల కంటే, రిజర్వేషన్ అనుభవిస్తున్న, ఎస్సీ ఎస్టీ కులాల వారే మోసం చేస్తున్నది వాస్తవం కాదా?

భారతదేశంలోని మహిళలకు పురుషులతో పాటు సమాన వాటా కావాలని పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే, బిల్లు పాస్ కాకుండా అవమానించిన పాలకులు కుట్రపూరితంగా బిల్లు వీగిపోతే తొలి న్యాయ శాఖ మంత్రి కి రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను మహిళలు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు, ఏడు దశాబ్దాల కాలం గడిచిన,నేటికీ మహిళా బిల్లు అసంపూర్తిగా ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా?

బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్, జ్యోతిరావు పూలే, మరో కొంతమంది దళిత బహుజన మహనీయులను అమ్ముకునే వారు కొందరైతే, ఆరాధిస్తున్న వారు మరికొందరు.

భారతదేశంలోని దళిత బహుజనుల అనగారిన వర్గాలు రాజ్యాధికారం లోకి తీసుకు రావాలని కలలు కని, భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను, తన కింద పని చేస్తున్న అటెండర్ను పోటీకి పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించింది ఎవరు?

డాక్టర్ బి.ఆర్,అంబేద్కర్ గారి భార్య మాత రమాబాయి అంబేద్కర్ గారు, కొడుకులు గంగాధర్, రమేష్, రాజారత్నం, కూతురు ,ఇందు, దళిత వర్గాల అభ్యున్నతి అభివృద్ధి కోసం నిద్రలేని రాత్రులు గడిపి రక్తహీనత వ్యాధితో రమాబాయి అంబేద్కర్ గారు మరణించింది మనకోసం కాదా?

బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అగ్రకులాలకు కూడా వ్యతిరేకం కాదు
ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధిపత్య అగ్రకులాలకు వ్యతిరేకమైతే, రమాబాయి అంబేద్కర్ గారు మరణించిన తర్వాత,బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఏరి కోరి బ్రాహ్మణ కులానికి చెందిన, డాక్టర్ సబితా అంబేద్కర్ (శారదా అంబేద్కర్) ఎందుకు వివాహం చేసుకుంది?

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విద్య గురువు బ్రాహ్మణ కులానికి చెందిన అంబావాడేకర్ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను వెలికి తీసిన ధనంజయకేర్ బ్రాహ్మణుడు కాదా?

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సేవ చేయడం కోసం వారికి విద్య నేర్పడానికి మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మనకోసం ఎన్ని అవమానలు పడ్డది వాస్తవం కాదా?

ఆ మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే ఆ మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుడితే బహుజనుల సేవకు ఆటంకం కలుగుతుందని పసరుమందు తాగి పిల్లలు పుట్టకుండా మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు పిల్లలు కనకుండా ఉన్నది వాస్తవం కాదా?

మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు దళిత కులానికి చెందిన కారణంగా,ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా?

ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల కోసం ప్రాణాలర్పిస్తే మనం వారికి ఇస్తున్న గౌరవం ఏది?

ఆ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ అనగారిన వర్గాల సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా సాంస్కృతపరమైన హక్కుల ఆ మహానీయుడు బ్రతికున్నంత కాలం మన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ వారికి అండగా నిలిచాడు.

ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బోధించు సమీకరించి పోరాడు అనే నినాదం.
మహనీయుల ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి.

జై భీమ్ జై జై భీమ్

– దుబాసి బొందయ్య జై కుమార్
(అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత)

LEAVE A RESPONSE