– అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం స్థలం చూపించలేదు అనడం మూర్ఖత్వం . సీఎం కేసీఆర్ 2014 నుండి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు ప్రధాని మోదీని కలిసి డిమాండ్ చేసిన విషయం నిజం కాదా?గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించిన విషయం నిజం కాదా?స్థలాన్ని పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపిన కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేసింది మీరు కదా?
గుంట భూమి కూడా కేటాయించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ నిచ్చిన కేంద్ర ప్రభుత్వం,తెలంగాణ గిరిజన యూనివర్సిటీని ఇవ్వకుండా వివక్ష చూపింది నిజం కదా?గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింతే ఇన్నేళ్లు ఆమోదించకుండా తొక్కిపెడుతుంది మీరు కదా….అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదు.కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 50 కోట్లతో జోడేఘాట్ నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.గిరిజన సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.
గిరిజనుల ఓట్లు దండుకునేందుకు బిజెపి కుట్రలు చేస్తోంది.ఎన్నికల సమయంలో గిరిజన యూనివర్సిటీ ప్రకటన బిజెపి కుట్రలో భాగమే.10 ఏళ్లుగా తెలంగాణలోని గిరిజనులకు కేంద్ర బిజెపి ఏం చేసిందో చెప్పాలి.బీజేపీ దొంగ హామీలు, మోసపూరిత వాగ్దానాలు మా గిరిజన బిడ్డలు ఎట్టి పరిస్థితిలో నమ్మరు.కేంద్ర బీజేపీకి గిరిజనుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్ ఆమోదించి దేశవ్యాప్తంగా జనాభా దామోస ప్రకారం గిరిజన రిజర్వేషన్ అమలు చేసి చూపించాలి. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో గెలుపు బిఆర్ఎస్ దే