Suryaa.co.in

Features

గోదావరి అలలలో అమ్మ పిలుపు ..!!

ఉదయాన్నే 5.30 కి లేవడం…అమ్మ నిద్ర లేచిందో లేదో చూసుకోవడం..బయటకి వెళ్ళి పాలు తెచ్చి వాటిని మరగబెట్టి అమ్మని నిద్ర లేపడం తదుపరి ఇంటి పనుల్లో అమ్మకి సహాయ పడుతూ దైనందిన జీవితానికి ఉపక్రమించడం….ఇది రోజు వారి మోహనవంశీ జీవితం….!!!! ప్రతి రోజులాగే తనకి ఉదయం 5.30 కి నిద్ర నుండి మెలుకవ వచ్చింది..అవును బయటకి వెళ్ళి పాలు తేవాలి అనుకుంటూ ఆవలిస్తూ నిద్ర లేచాడు మోహనవంశీ..అమ్మ నిద్రలేచిందో లేదో చూద్దాం అనుకుంటూ ఒక్కసారి అమ్మ మంచం కేసి చూసాడు….అక్కడ అమ్మలేదు..ఒక వేళ బాత్రుంకి వెళ్లిందేమో అనుకుంటూ కాసేపు అట్లాగే మంచం మీదనే ఉన్నాడు…ఎంత సేపు అయినా ఇంకా అమ్మ రాకపోయేటప్పటికి గుండెల్లో ఏదో కొద్ది పాటి అలజడి ప్రారంభం అయ్యింది.

ఈ లోగా గోడ గడియారం 6 గంటలు అయిందంటూ గంటలు కొడుతూ శబ్ధం చేసింది..ఒక్కసారి ఉలిక్కిపడి మోహనవంశీ వర్తమానంలోకి వచ్చేసాడు….అప్పుడు అర్ధం అయింది తనకి…బాత్రుంకి వెళ్లిన అమ్మ ..ఇంకా రాలేేంటబ్బా అని తాను అనుకుంటున్నది అంతా తన మనస్సును కమ్మేసిన అమ్మ జ్ఞాపకాలు అని…ఇంక అమ్మ ఎప్పటికి రాదని కాదు..కాదు…ఇంక లేదని.. అమ్మ అస్వస్ధతో దేవుని వద్దకు చేరుకున్నప్పటినుండి మోహనవంశీ ప్రతి రోజు అమ్మ దూరం అయిన అనంతరం అనుభవిస్తున్న మానసిక క్షోభ ఇది…!!.

అంతేనా మధ్యాహ్నం లంచ్ టైమ్ లో భోజనం చేసావా అంటూ అమ్మ చేసే ఫోన్ ఇంక రాదు అని తెలిసినప్పుడు మోహనవంశీకి ముద్ద గొంతు దిగడం లేదు… ఆఫీస్ నుండి ఇంటికి 10 కి.మి ఉంటుంది…ప్రతిరోజులాగే ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటి వైపు పోయే బస్సు ఎక్కి చిన్నపాటి కునుకు తీస్తున్నాడు…ఈ లోగా ఏదో చిన్నపాటి శబ్ధం వినబడి ఇంటికి వచ్చేటప్పుడు ఏవైనా మందులు కాని,, పండ్లు ఫలాలు తెమ్మంటూ ప్రతి రోజులాగే అమ్మ ఫోన్ చేసిందేమో అనుకుంటూ ఉలిక్కిపడి లేచి జేబులో ఉన్న తన సెల్ ఫోన్ కేసి చూసుకున్నాడు మోహనవంశీ.

కానీ ఫోన్ ఏమి రాలేదు..బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వెయ్యడంతో వచ్చిన శబ్ధం అది…అప్పుడు మరల వర్తమానంలోకి వచ్చాడు మోహనవంశీ…అవును అమ్మ చనిపోయింది కదా…ఇంక ఫోన్ ఎందుకు వస్తుంది అనుకుంటా తలంపు రాగానే అప్రయత్నంగానే మోహనావంశీ కంటిలోనుండి కన్నీళ్ళు కట్టలు త్రెంచుకుంటున్నాయి….చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించిన అమ్మ…మరియు అదే చేతులలో నా చెయ్యి పట్టుకుని అడుగులు వేయడం నేర్పించిన అమ్మ ఇంక లేదా అనుకుంటూ మోహనవంశీకి గుండేలు ఉప్పెన స్పీడ్ తో బాధతో నిండి పోయింది.

భారమైన హృదయ వేదనతో ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ సెల్ ఫోన్ లో నుండి తన ఫోన్ కి రింగ్ చేసుకున్నాడు…అప్పుడు తన సెల్ ఫోన్ లో అమ్మ అని డిస్ ప్లే రావడం చూసి అమ్మ ఫోన్ చేసింది అనుకుంటూ..ఆమె ఎక్కడికి పోలేదు అనుకుంటునే బోర్ మని ఏడ్చేసాడు మోహనవంశీ…అప్పటి నుండి అమ్మని చూడలని అనిపిస్తున్నప్పుడల్లా అమ్మ సెల్ ఫోన్ లో నుండి తన సెల్ ఫోన్ కి డయల్ చేస్తూ సెల్ ఫోన్లో అమ్మ అని చూడటాన్ని రీవాజుగా చేసేసుకున్నాడు మోహనవంశీ..!!!. ఇవేమీ పట్టనట్టుగా కాలచక్రం తనపని తాను చేసుకుపోతోంది..వారాలు..నెలలు గడుస్తున్నాయి..మోహనవంశీ మది లో మాత్రం అమ్మ జ్ఞాపకాలు అట్లానే గూడు కట్టుకుని అయ్యి పలకరిస్తూనే ఉన్నాయి…. హైదరాబాద్ లోనే ఉంటున్న మోహనవంశీ ఒకరోజు ఓ పని నిమిత్తం రాజమండ్రి బయలు దేరాడు
• * *
“హ్యాపి బర్త్ డే”…”జన్మదిన శుభాకాంక్షలు”.. “లాంగ్ లివ్”…అంటూ హితుల నుండి ఫోన్ లు, మెసెజ్ లు వస్తూ ఉంటే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తూ ట్రైన్ లో ఉన్న మోహనవంశీకి మెలుకవ వచ్చింది. తన జేబులోనుండి ఫోన్ ను తీసుకుని చూసుకుంటున్నాడు మోహనవంశీ ..అవును “ఈ రోజు తన పుట్టిన రోజు!!.. పుట్టినరోజు జరుపుకునే సందర్భం కాదు ఇది ఎందుకంటే అమ్మపోయి రెండు నెలలు కూడ కాలేదు… మా అమ్మ చనిపోయిన విషయం తెలియని కొందరు..తెలిసినప్పటికి బాధనుండి నన్ను డ్రైవర్ట్ చేయడానికి మరి కొందరు తనకు మెసెజ్ లు పంపుతున్నారు అనకుంటున్నాడు మోహనవంశీ..ఆ క్షణంలో కాస్తాంత బాధతో కండ్లు మూసి తెరిచి ట్రైన్ లో నుండి బయటకి చూస్తున్నాడు…తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ కి ట్ర్తైన్ చేరుకుంది…!!

అలవోకగా ఒక్కసారి మోహనవంశీ కళ్ళు చెమ్మగిల్లాయి..ఎందుకంటే తనని అమ్మ ఈ ఉర్లోనే కనింది… అమ్మ నన్ను కనిన తేది వచ్చింది…అట్లాగే అమ్మ తనను కన్న ఊరు కూడ ఇప్పుడు తన కళ్ళ ముందే ఉంది…కాని ఆ అమ్మే ఇప్పుడు తన చెంతన లేదు!!..ఓరి దేవుడా అనుకుంటూ మనస్సులో నుండి ఉబికి వస్తున్న బాధను తొక్కిపెట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు…ఆయినా ఆ దేవుడ్ని తలచుకుని ఏ ప్రయోజనం??..వాళ్ళందరు అమృతం తాగిన వాళ్ళు కదా!!.. మనుఘలు దూరం అవ్వడం దరిమిలా మిగిలి ఉన్న వారికి దూరమైన వారి మమతానురాగాల జ్ఞాపకాలు ఉప్పెనలా చుట్టూ ముట్టం వంటి బాధలు ఉండవు…ఆయినా తన అమ్మ వారి కంటే ఏమి తక్కువ!!..వారి కంటే నా అమ్మే గొప్పది అని మోహనవంశీ తన మనస్సులో అనుకుంటూ గుండెల్లో బాధని తమాయించుకుని ప్రయత్నం చేసుకుంటున్నాడు మోహనవంశీ…

కానీ తన మనస్సులో ఏదో తెలియని బాధ..ఎందుకంటే అమ్మ బ్రతికున్న రోజులలో ఏదైనా ప్రయాణం నిమిత్తం ట్రైన్ ఎక్కిన క్షణం నుండి అమ్మ ఫోన్ లు వచ్చేవి…ట్రైన్ జాగ్రత్తగా ఎక్కావా ??…ట్రైన్ లో ఏమైనా తిన్నవా??…పని చూసుకుని వెంటనే తిరిగి వచ్చేయ్ అంటూ అమ్మ ఫోన్ చేసేది!!… అంతేనా..తిరిగి ఇంటికి చేరుకోగానే అమ్మ తన కోసం ఎదురు చూస్తూ గుమ్మంలో ఎదురు చూస్తూ ఉండేది..ఇంటిదాకా వచ్చిన వాడ్ని ఇంటిలోకి రానా ఆ మా త్రం దానికి గుమ్మంలో నిల్చుని ఎదురు చూడం ఎందుకు అంటూ ప్రయణ బడలికలో ఉన్న తాను చిరు కోపం చూపించిన సందర్భం గుర్తుకు వచ్చింది మోహన వంశీకి.

ఆ క్షణంలో తన యెక్క ఆ చిరు కోపాన్ని నవ్వుతూనే స్వీకరిస్తూ తన అమ్మ అనేది.. నీకు “మా అన్నయ్యలాగే” కోపం ఎక్కువ అంటూ “తన తోబట్టువులలోని” పోలికలను తనకు ఆపాదిస్తూ ఆనందపడేది…!! అలాంటి తన అమ్మ నేడు ఎక్కడ..?? ..నా కోసం గడప దగ్గరే ఎదురు చూసే మా అమ్మ నేడు ఎక్కడ??.. నేను అమ్మ…అమ్మ అని పిలుస్తూ ఇంటి తలుపుకొడ్తున్నప్పటికి తలుపు తీయడం లేదు!!..అవును అమ్మ ఇప్పుడు లేదు కదా!!…అసలు నేను ఏమి తిన్నానో..తినలేదో అడిగేవారు లేరు!!…నా రాకపోకల గురించి ఎదురుచూసే చూపులే కరువయ్యాయి!!…అనుకుంటూ బాధ పడుతున్న మోహనవంశీ కి తాను ఎక్కిన ట్రైన్ రాజమండ్రి సమీపానికి చేరుకోవడాన్ని గమనించాడు.

అతను ప్రయాణిస్తున్న రైలు నెమ్మదిగా రాజమండ్రి లోని గోదావరి బ్రిడ్జికి పైకి చేరుకుంటోంది…ట్త్రైన్ బ్రిడ్జిపైనుండి వెళ్తూంటే ఆ బ్రిడ్జ్రి కింద నుండి ప్రవహిస్తున్న గోదావరి నది వైపు చూస్తున్నాడు మోహనవంశీ…ఎందుకో ఒక్కసారిగా గోదావరి అలల మధ్య నుండి అమ్మ తనను పిలిచినట్టుగా భ్రాంతి కలిగింది మోహనవంశీకి !!…అప్పుడు గుర్తుకు వచ్చింది…అమ్మ మరణించిన పిమ్మట జరిగిన కర్మక్రియలలో భాగంగా అమ్మ అస్తికలను ఇక్కడే కదా కలపబడింది..!! భౌతికంగా ఆమె దూరమైనప్పటికి ఈ గోదావరి ఆలలలోనే ఆమె నిలిచి ఉందని అనిపిస్తోంది…తనను చూసిన అమ్మే ఆలల రూపంలో తన దగ్గరికి వస్తున్నట్టుగా మోహనవంశీకి అనిపిస్తోంది!!…ఆ ఆలల రూపంలో ఉన్న తన అమ్మే తనకేదో చెప్పాలని తపన గోదవరి అలలలో కనిపిస్తోంది మోహనవంశీకి……ఆ నదిలోని పడిలేచే ఆలలు మా అమ్మ నాకు ఏదో చెప్పటానికి పడుతున్న ఆరాటంగా కనిపిస్తూ ఉంటోంది మోహన్ వంశీకి…!!..

“జాతస్యహి ధృవో మృత్యు: ధ్రువం జన్మ మృతస్యచ తస్తాద పరిహార్ధేనత్వం శోచితుమర్హసి” అని గోదావరి అలల హోరులో లీలగా వినిపిస్తునట్టు అనిపించింది మోహనవంశీకి… ఒహో…”పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు..కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీపు శోకించవద్దు..!” అని భగవద్దీతలోని జీవిత సత్యాన్ని నాకు చెప్పడానికే అలలు రూపంలో అమ్మ నా వైపుకు వస్తోందన్నభావన ఒక్క క్షణంపాటు మోహనవంశీకి కనీళ్ళు ఉబికి వచ్చాయి….!!….. ” అహా నిజంగా గోదావరి అలల హోరులో ఎంతో గూఢర్ధాం దాగిఉంది, అందుకే కదా” కవులు వేదంలా ఘోషించే గోదావరి ….!” అని పేర్కొన్నది అని ఒక్క క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు మోహనవంశీ..!!

ఇంతలోనే మోహనవంశీని ఊరడింపు చేస్తున్నట్టుగా గోదావరి నుండి వచ్చే చల్లటి గాలులు తనను తాకగానే వర్తమానంలోకి వచ్చాడు మోహనవంశీ…అప్పుడు తనని తాను తన్మయింటుకుంటూ..అమ్మ భౌతికంగా లేకపోవచ్చు… ఈ గోదావరి ప్రవహిస్తున్నంత కాలం గోదావరి ఒడిలోనే మా అమ్మ సేద తీరుతూ ఉంటుంది..!! .. పడిలేచే ఆ గోదావరిలోని అలలే నాకు అమ్మ పలకరింపులు..!!..మన చూట్టు అవహించి ఉండే పంచభూతలే మా అమ్మ తోబుట్టువులు..మా అమ్మయొక్క ఆ తోబుట్టువులే నాకు బందువులు…!!…అని తనని తాను తన్మయించుకుంటూ భారమైన హృదయంతో మోహనవంశీ జీవిత గమనంలోకి అడుగులు వేస్తున్నాడు….!!
(అల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రం నుండి రచయిత వాయిస్ తోనే ప్రసారం కాబడిన కధానిక)

sripada
– శ్రీపాద శ్రీనివాస్

 

LEAVE A RESPONSE