రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన

◆టిడిపి కార్యాలయాలపై దాడికి ఖండన
◆ఇది ప్రజలు,ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి
◆ఈ దాడి ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్ష
◆రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి
◆ప్రజల మౌనం సమాజానికి చేటు
◆అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి సహకరించాలి
రాష్ట్రంలో అరాచక రౌడీ పాలన సాగుతుందని ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు ఈ సందర్భంగా పర్చూరు ఎమ్.ఎల్.ఏ సాంబశివరావు,అద్దంకి ఎమ్.ఎల్.ఏ రవికుమార్, కొండెపి ఎమ్.ఎల్.ఏ స్వామి,ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు ప్రమాదకరమన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దేశ చరిత్రలో ఎక్కడా దాడి జరగలేదన్నారు. రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగుతోందని ,వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి దుశ్చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, వైసీపీ నేతల ఇళ్ల పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.దీన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి రాష్ట్రానికే మాయనిమచ్చ అన్నారు. ఈ దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కాదని ప్రజలు ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పార్టీ కార్యాలయంపై దాడి ఈ అరాచక చర్యలను ఖండించాలనన్నారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం జరిగే బందులో ప్రకాశంజిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించి రౌడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు.
మంచి వారి మౌనం సమాజానికి చేటని మేధావులు ప్రజాస్వామిక వాదులు ప్రజలు విద్యావంతులు ఒకసారి ఆలోచించాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరితే అందరూ అవకాశం ఇచ్చారని ఒక సారి గెలిస్తే ఇలా చేస్తే భవిష్యత్ తరాల మనుగడ ఏమిటని ప్రశ్నించారు. ఎవరి ఇంట్లో వారు ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రతిపక్షం ప్రజల గొంతుకగా ప్రజల వాణిని వినిపిస్తుదన్నారు. అలాంటి గొంతు నొక్కే ప్రయత్నాలు ఏపీలో జరుగుతుందన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించే ప్రతిపక్షాన్ని భయపెట్టి దాడులతో ఆపాలనే దుస్సాహసం చేస్తున్నారని వైసిపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం దారుణమన్నారు. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారని ఆరోపించారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ గుండాలు వెళ్లి కార్యాలయంలో కనపడినవారిపై దాడి చేసి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ బందుకు సహకరించి దాడిని తిప్పి కొట్టాలన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడిందన్నారు.
వైసిపి ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నారు. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దారి ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్ష అన్నారు. బుధవారం జరిగే బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Leave a Reply