Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ కేసులు పెట్టడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం నాడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ,వెంటనే నారా చంద్రబాబునాయుడు గారిని విడుదల చేయాలని “బాబు కోసం మేము సైతం” అంటూ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నందిగామ మండలం మునగచర్ల,అడవి రావులపాడు,లింగాలపాడు, తక్కెళ్ళపాడు,కంచికచర్ల మండలం కీసర,గండేపల్లి గ్రామాల తెలుగుదేశం పార్టీ నేతలకు జనసేన నేతలు మరియు స్థానిక తెదేపా నేతలతో కలిసి దండలను వేసి దీక్షను ప్రారంభించి వారి దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.

ఈ సందర్భంగా సౌమ్య ఏమన్నారంటే.. .. అక్రమ కేసులను పెట్టించడంలో జగన్ రెడ్డి రికార్డులు నెలకొల్పుతున్నారు.అవినీతి మచ్చలేని చంద్రుడు చంద్రన్న మీద బురదజల్లే ప్రయత్నాలు అత్యంత దుర్మార్గం.జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి తన కనుసనలలో వ్యవస్థలను నడిపిస్తున్నారు.ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ “బాబు కోసం మేము సైతం” అంటూ తెలుగు వారందరూ కదం తొక్కి కదిలారు.నారా చంద్రబాబునాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. న్యాయపోరాటంలో అందరం భాగస్వాములై బాబు కి తోడుగా నిలుద్దాం..

LEAVE A RESPONSE