Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ అభ్యర్థులను నామినేటెడ్ పద్దతిలో కార్పొరేటర్లుగా ప్రకటించుకోండి

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో వైసిపి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారుల వైఖరిని నిరసిస్తూ జిల్లా కలెక్టర్


కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ హోం శాఖ మంత్రి నిమ్మలకాయల చిన్న రాజప్ప, బీసీ జనార్థన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , బీద రవిచంద్ర, షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్ళపాక అనురాధ తదితరులు.
అనంతరం మీడియాతో బీద మాట్లాడుతూ….నెల్లూరు కార్పొరేషన్ ను గుంపగుత్తగా వైసీపీకి అప్పగించేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారు.ఓటమి భయం తో టిడిపి అభ్యర్థులను బెదిరించి బలవంతం గా వైసీపీ కండువాలు కప్పి ఎన్నికల నిబంధనల ఖూనీ చేస్తున్నారు.అధికార పార్టీ ఒత్తిళ్లతో కలెక్టర్ స్థాయి నుంచి, కింది స్థాయి అధికారి వరకు ఏకపక్షంగా నెల్లూరు కార్పొరేషన్ ను వైసిపికి అప్పగించేందుకు కుట్ర జరుగుతోంది.ఆర్వో లు, వారి సిబ్బంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి సంతకాల పేరుతో పిలిపించి వైసిపి నాయకులకు నిస్సిగ్గుగా అప్పగిస్తున్నారు.
నామినేషన్లు వేసేందుకు టిడిపికి అభ్యర్థులు దొరకడం లేదని మాట్లాడిన మంత్రి అనిల్ కు గెలుపుపై అంత ధీమా ఉంటే, టిడిపి అభ్యర్థులను బెదిరించి చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే, టిడిపి అభ్యర్థులపై బ్రోతల్ కేసులు, వారి వాహనాలలో గంజాయి పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించడం , అభ్యర్థుల స్కూల్స్ పై దాడులు చేయడం.. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బతీస్తామని బెదిరిస్తున్నారు.
నామినేషన్ ఉపసంహరణ సమయం ముగిసినా ఎన్నికల నిబంధనల కు పాతర వేసి ప్రచారం లో ఉన్న టీడీపీ అభ్యర్థుల ను పిలిపించి నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.
ఏ రోజు నుంచి అయితే వైసిపి నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడ్డారో ఆరోజే నైతికంగా ఓడిపోయారు.

LEAVE A RESPONSE