‘డూ ఆర్ డై’ ఉద్యమం అవసరం: రాహుల్ గాంధీ

0
45
  • క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్
  • నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ఉద్యమం అవసరమన్న రాహుల్
  • దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులు అర్పించిన రాహుల్

క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ‘డూ ఆర్ డై’ ఉద్యమం అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ‘డూ ఆర్ డై’ వంటి ఉద్యమం అవసరమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం అవసరం ఎంతైనా ఉందన్నారు.

అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నట్టు రాహుల్ గాంధీ ఆ పోస్టులో పేర్కొన్నారు.