Suryaa.co.in

Entertainment

స్వయంకృషికి మరో మెగా అవార్డు!

ఆయన మెగాస్టార్..
తెలుగు సినిమా గతిని..శృతిని మార్చిన
సుప్రీం హీరో..
హీరోకి పరుగు నేర్పి..
డాన్సుకి డిస్కో సొగసులద్ది..
స్టంటు వేగం పెంచి..
టాలీవుడ్ ను తన అపారచాతుర్యంతో
రఫ్ఫాడించిన గాంగ్ లీడర్..
కళ్ళలో మెరుపు..
కదలికలో స్టైల్..
డైలాగ్ డెలివరీలో అందమైన మాడ్యులేషన్..
పాత్రకు తగిన అభినయం..
సన్నివేశానికి తగ్గని
నటన..ఎమోషన్..
సిట్యు”వేషం”న్ డిమాండ్ చేసే రౌద్రం..గాంభీర్యం..
కామెడీ..టైమింగ్..
రొమాన్స్..ఏది కావాలంటే
అది తగిన మోతాదులో
ప్రదర్శించే పరిపూర్ణ నటుడు..చిరంజీవి..!

తెలుగు సినిమాని
అయిదుగురు పెద్ద హీరోలు
ఎన్టీఆర్..ఏయెన్నార్..కృష్ణ..శోభన్ బాబు..కృష్ణంరాజు శాసిస్తున్న వేళ..
ఇంకా తమిళంలో అప్పటికే స్టార్స్ గా మారి రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలు..
అప్పుడప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్న
కమల్ హాసన్ ..రజనీకాంత్
తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని
విజృంభిస్తున్న తరుణంలో..
తెలుగులోనే ఇంకా మురళీ మోహన్..చంద్రమోహన్..
రామకృష్ణ..రంగనాథ్..శరత్ బాబు..నరసింహరాజు వంటి
వారు హీరోలుగా వెలిగిపోతున్న దశలో..అరంగేట్రం చేసిన మొగల్తూరు చిన్నోడు
చిరంజీవి అచిరకాలంలోనే
తనకంటూ ఒక స్పేస్ ఏర్పాటు చేసుకుని ఎదిగాడు.అయితే ఆ ప్రస్థానం అంత సులువుగా మొదలు కాలేదు.మనవూరి పాండవులు సినిమాలో అయిదుగురు అన్నదమ్ముల్లో
ఒకడిగా నటించినా తన ప్రత్యేకతను చాటుకుని
తన ఎంట్రీని గ్రాండ్ గానే చాటుకున్నాడు కొణిదెల శివశంకర ప్రసాద్..తర్వాత విలను..ప్రతినాయక ఛాయలున్న హీరో..
కుర్రోడు పర్లేదు అనుకుంటున్న దశలో వచ్చింది న్యాయం కావాలి.. తెలుగు సినిమాకి మరో హీరో దొరికేసినట్టే..అంతలోనే ఖైదీ..తెలుగు రాంబో..
అమ్మ బాబో.. ఏమి వేగం..
ఒక కొత్త నాయకుడు..
అక్కడి నుంచి వెనక్కి చూడలేదు చిరంజీవి..
వరస హిట్లు..తెలుగు సినిమాలో దూకుడు పెరిగింది..హీరోయిజం అర్థం మారింది..కొత్త నడక నేర్చింది..!

ఎటువంటి భావాన్నయినా ఇట్టే పలికించే కళ్ళు..
గాలి కంటే వేగంగా కదిలే
కాళ్ళు..డాన్సు నేర్చుకోకపోయినా అద్భుతంగా నృత్యం చేసే రిధం..చక్కని గొంతు..
వీటన్నిటినీ మించి అబ్బురపరిచే వ్యక్తిత్వం..
ఇన్ని ఉన్న మనిషి హీరో కాకుండా ఎలా ఉంటాడు..
అలా అయ్యాడు కొణిదెల శివశంకర ప్రసాద్..మెగాస్టార్ చిరంజీవి..అతడే విజేత..
సీనియర్ హీరోల కంటే భిన్నమైన మగమహారాజు
ఎన్టీఆర్..నాగేశ్వరరావు వంటి హీరోలను చూసి క్రమశిక్షణ నేర్చుకున్న హిట్లర్..ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించే మాస్టర్..
ఈలోగా అల్లు వారింటి
రౌడీ అల్లుడు…
153 సినిమాల అద్భుత ప్రస్థానం..తెలుగు సినిమా
ప్రయాణాన్ని మార్చిన
పద్మభూషణుడై..
అశేష జనాల్ని విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్..!
పవన్ ..నాగబాబులకు మాత్రమే గాక కోట్లాది అభిమానులు ఆరాధించి
అభిమానంగా పిలుచుకునే
అన్నయ్య…!

ఇప్పుడు కొణిదెల కిరీటంలో
మరో కలికితురాయి..
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ
ఆఫ్ ది ఇయర్ 2022
నలభై అయిదేళ్ల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం..
అలుపెరుగని గమనంలో అధిరోహించిన మరో
చారిత్రక శిఖరం..

Chiranjiivii..
You deserve any level of award..infact the award is honoured..
India is happy..
You always make everybody proud..
Keep rocking..
We wish you recieve more such awards..before reaching the milestone
Of 200 movies..
Keep rocking..

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE