ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. జనరంజకమైన బడ్జెట్‌ను తీసుకొచ్చిందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పలు రకాలైన ప్రజా సమస్యలను సభ్యులు లేవనెత్తగా… ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతగా సమాధానం చెప్పిందన్నారు.
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం అనేక రకాలైన చట్టాలను తీసుకొచ్చిందని కొనియాడారు. అద్భుతమైన చట్టాలను ఆమోదించిండంలో భాగస్వామ్యులైనందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శాసనమండలి కూడా నిరవధిక వాయిదా పడింది.