జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా పురోగమిస్తోందని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత శిద్దా రాఘవరావు అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి, వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన శిద్దా రాఘవరావు ఇంటింటికీ తిరిగి వైసీపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.
బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి పట్టణంలోని మైదుకూరు రోడ్,సిద్దవటం రోడ్లో ,పోరుమావిళ్ళ లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంద్రప్రదేశ్ రాష్టంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ముందుందని అన్నారు.ఈ నెల 30 వ తేదీ జరుగు ఉప ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.ఏ.అన్నా రాంబాబు, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ బోర్డ్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, టీటీడీ బోర్డ్ సభ్యులు టంగుటూరి మారుతి ప్రసాద్ బద్వేలు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, బద్వేల్ మునిసిపల్ వైస్ చైర్మన్ సాయి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.