సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నుంచి పోరాటం

– పిఆర్సీ తరహాలో రెండో ఉద్యమం
– ఉద్యోగులు తీవ్ర మనోవేదన లో ఉన్నారు
– ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు
– సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే అడుగుతున్నాం
– తెలంగాణాలో కూడా టీచర్స్ కూడా గవర్నర్ కలిశారు
– ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు
– ఏపి ప్రభుత్వ ఉద్యోగులు సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం

గుంటూరు: ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులు చర్చనీయాంశంగా మారాయి.మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం అనధికారికంగా వాడుకుంటుంది.ఉద్యోగులు తీవ్ర మనోవేదన లో ఉన్నారు.ఉద్యోగ సంఘాలపై కత్తి పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటుంది. మా సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నుంచి పోరాటం చేయనున్నాం.

గతంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే అడుగుతున్నాం.ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వటం లేదు.12వ పిఆర్సీ వచ్చే జూన్ నాటికి ఇవ్వాల్సి ఉంటుంది11వ పిఆర్సీ లో అనేక అంశాలకు సంబంధించి ఇంకా జీవోలు ఇవ్వలేదు.గవర్నర్ కు మోమోరాండం ఇస్తే వివాదాస్పదం చేశారు. ఉద్యోగ సంఘాల సమావేశానికి మమ్మల్ని ఎందుకు పిలవ లేదు.ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది.రోసా నిబంధనల ప్రకారం ఫెడరేషన్ పెట్టవచ్చా.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగ ప్రకటన చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఉద్యోగ వ్యతిరేక విధానాలకే మేము వ్యతిరేకం.బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పిఆర్సీ తరహాలో రెండో ఉద్యమం రానుంది. తెలంగాణాలో కూడా టీచర్స్ కూడా గవర్నర్ కలిశారు మేము ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు.నిజాలు మాట్లాడుతున్నందుకే మాపై అభాండాలు వేస్తున్నారు

Leave a Reply