Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి మేరుగు నాగార్జున కారుకు ప్రమాదం

– ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే మంత్రి
– వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్తుండగా కారు ప్రమాదం
– మంత్రికి కుమారుడు కిరణ్ పెదవికి స్వల్ప గాయాలు, ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు అనంతరం డిచార్జ్

ముందుగా వెళ్తున్న వాహనానికి ఆటో అడ్డువచ్చి బ్రేకు వేయడం అవాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడం . మంత్రి కారువెనుక కన్వాయిలో ఉన్న కారు మంత్రి కారును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయింది . ఈ క్రమంలో మంత్రి నాగార్జున కారు ముందూ , వెనుక భాగాలూ దెబ్బతిన్నాయి.

మంత్రి తో పాటుకారులో ఉన్నోల్లందరూ ముందూ వెనక్కు కొట్టొకొవడంతో వెన్నుపూసలు కదిలాయి . సమీపంలోఉన్న ప్రయివేటు అస్పత్రిలో అందరూ అన్నిరకాల పరీక్షలు చేయించుకుని , డాక్టర్లు ఇబ్బదులేమి లేవని తేల్చడంతో అప్పటిదాక షాక్లో వున్నవారు అందరూ ఊపిరిపీల్చుకున్నారు .

మంత్రి నాగార్జున తోపాటుగా కారులో ప్రయాణిస్తున్న అయన పెద్ద కుమారుడు కిరణ్ తానెదురుగా ఉన్న సీటుకు కొట్టుకోవడంతో పెదవి భాగం పగిలి స్వల్ప రక్త స్రావం అయింది .

LEAVE A RESPONSE